Gold Investments: బంగారంపై ఇన్వెస్ట్మెంట్.. డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీ.. 

బంగారంలో పెట్టిన పెట్టుబడిపై రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ఐదేళ్ళలో బంగారంలో పెట్టిన డబ్బు డబుల్ అయింది. ఒక్క నెలలో 9 శాతం రాబడికి గోల్డ్ ఇస్తోంది. 

New Update
Gold Investments: బంగారంపై ఇన్వెస్ట్మెంట్.. డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీ.. 

బంగారం మన దేశంలో అందరికీ ఎంతో ఇష్టమైన లోహం. పెళ్లిళ్లు.. పండగలు.. పూజలు.. ఏదైనా సరే ఒక్క గ్రాము బంగారం (Gold Investments)అయినా కొనాలి అనుకునేవారు చాలామందే ఉంటారు. ఇక బంగారాన్ని మంచి పెట్టుబడి ఆప్షన్ గా చూస్తారు. ఆభరణాలు లేదా బిస్కెట్లు వంటి భౌతిక రూపంలోనే కాకుండా డిజిటల్ గా కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసే విధానాలు ఇప్పుడు చాలా వచ్చాయి. ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి లాభసాటిగా ఉండడమే కాకుండా సురక్షితమైన పెట్టుబడి విధానంగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

బంగారం 2023లో ఇప్పటివరకు 9% రాబడిని ఇవ్వగా, గత ఏడాదిలో 20% రాబడిని ఇచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు. అంటే, ఈ ఏడాది కూడా బంగారం 20% రాబడిని పొందవచ్చు.

మధ్యప్రాచ్యంలో సైనిక ఘర్షణల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు ఔన్స్కు మూడు నెలల గరిష్టానికి 1,978 డాలర్లకు పెరిగాయి. జూలై 31తర్వాత స్పాట్ గోల్డ్ గరిష్ట స్థాయి ఇదే.

వచ్చే ఏడాది ద్వితీయార్ధం నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

5 సంవత్సరాలలో బంగారంపై 100% రాబడి

  • గత ఐదేళ్లలో బంగారం(Gold Price) రెట్టింపు అయింది. 10 ఆగస్టు 2018న 29 గ్రాముల బంగారం ధర రూ. 29,486 ఉండగా, 2023 ఆగస్టు 10 నాటికి రూ.58,947కు పెరిగింది.
  • ప్రపంచవ్యాప్తంగా 24% సెంట్రల్ బ్యాంకులు వచ్చే 1 సంవత్సరంలో బంగారం నిల్వలను పెంచుతాయి. డీ డాలరైజేషన్ కారణంగా బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. రిజర్వ్ కరెన్సీగా డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రక్రియను డీ-డాలరైజేషన్ అంటారు.

అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు(Gold and Silver Price) భారీగా పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు బంగారం ధర రూ.2,900 పెరిగింది. ఈ నెల ప్రారంభంలో అక్టోబర్ 2న 974 గ్రాముల ధర రూ.1,57 ఉండగా, ప్రస్తుతం రూ.719,10 వద్ద ఉంది. అదేసమయంలో కేజీ వెండి ధర రూ.60,693 నుంచి రూ.71,603కు తగ్గింది.

తేదీ  బంగారం ధర వెండి ధరలు
అక్టోబర్ 1 10 గ్రాములకు రూ.57,719 కిలో రూ.71,603
అక్టోబర్ 23 10 గ్రాములకు రూ.60,698 కిలో రూ.72,094

ప్రస్తుతం  బంగారం ధరలు పెరగడానికి 4 కారణాలు ఇవే.. 

  • మే ప్రారంభంలో ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం, అమెరికాలో డెట్ సీలింగ్ పై వస్తున్నా వార్తలు బంగారం ధరలకు బలంగా మద్దతునిచ్చాయి.
  • దీపావళి వరకు దేశీయ మార్కెట్లో బంగారానికి బలమైన డిమాండ్ ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్ల సీజన్లో భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. దీనికి మద్దతు లభిస్తోంది.
  • కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రారంభమైన తాజా ఇజ్రాయెల్, హమాస్  సైనిక ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచింది.
  • పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారాన్ని బలంగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం ధరలకు గట్టి మద్దతు లభించింది.

Also Watch:

Advertisment
Advertisment
తాజా కథనాలు