Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్!

ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు 300 మంది కార్మికులతో పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్!

Kesamudram : తెలంగాణ (Telangana) లో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే కే సముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ భారీ వరదకు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గనుంచి వెళ్లే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు.

ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక, సిమెంట్‌, కంకర తెప్పిస్తున్నారు. దాదాపు మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం మేరకు పనులు పూర్తి చేశారు. దాదాపు 300 మంది కార్మికులు పనిలో నిమగ్నమవగా.. సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ రైల్వే ట్రాక్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక మంగళవారం మధ్యాహ్నం వరకూ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్‌ రోడ్డు… పరిశీలించిన మంత్రి!

Advertisment
Advertisment
తాజా కథనాలు