/rtv/media/media_files/2026/02/03/trump-1-2026-02-03-21-00-10.jpg)
భారత్, అమెరికా దేశాల మధ్య చిరకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడుతూ ఒక భారీ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇరు దేశాలకు దౌత్యపరంగా లభించిన అతిపెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఉన్న టారిఫ్‌లను ట్రంప్ ప్రభుత్వం 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన అదనపు పెనాల్టీలను కూడా రద్దు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. దీనికి బదులుగా భారత్ కూడా అమెరికా నుంచి భారీగా చమురు, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది.
సెర్గియో గోర్ ఎవరు?
ఈ భారీ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జన్మించిన సెర్గియో, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ట్రంప్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కలిసి పబ్లిషింగ్ బిజినెస్ కూడా చేశారు. 2026 జనవరిలో భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన గోర్, అప్పటి నుంచి భారత్-అమెరికా బంధాన్ని ఒక అవకాశాల గనిగా అభివర్ణిస్తున్నారు.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీగా లాభం చేకూరుతుంది. రష్యాపై ఆధారపడకుండా అమెరికా, వెనిజులా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేసేలా వ్యూహాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. క్వాడ్ గ్రూపులో భాగస్వాములుగా ఉన్న రెండు దేశాలు, ఈ ఒప్పందంతో రక్షణ, ఇంధన రంగాల్లో మరింత సమన్వయంతో పనిచేయనున్నాయి.
Follow Us