/rtv/media/media_files/2026/03/11/fotojet-44-2026-03-11-10-24-14.jpg)
Iran America War
Iran America War : యుద్ధం యుద్ధం యుద్ధం అని మొత్తుకుని ఇరాన్ మీద పడిన ట్రంప్ కు..ఆ దేశం చుక్కలు చూపిస్తోంది. సుప్రీం చచ్చినా, ఎవరొచ్చినా, ఎన్నిదేశాలు ఏకమైనా రండ్రా చూసుకుందాం అని ఇరాన్ మీసం తిప్పి తొడ గొడుతోంది. అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? ఈ వార్‌లోకి దిగి ట్రంప్ తప్పుచేశాడా.? అమెరికా పెద్దన్న తన చావుని తానే కోరితెచ్చుకున్నాడా..? యుద్ధంపై తగ్గేదేలేదంటున్న ఇరాన్ వెనకుంది ఎవరు..? ఈ యుద్ధం ఎన్నేళ్లు కొనసాగుతుంది.? ఇరాన్ స్టేట్‌మెంట్‌తో ట్రంప్‌లో భయం మొదలైందా.? ఈ తింగరోడికి చావు తప్పదా..?
పులిని చూడాలనుకో.. కానీ పులితో ఆట ఆడకు చచ్చిపోతావ్..ఇప్పుడు ట్రంప్‌కి ఇదే సామెత సరిగ్గా సరిపోతుంది.ఎందుకంటే..యుద్ధం ఇరాన్ కోరుకుంది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయినా..కసి మాత్రం తగ్గలేదంటోంది..అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్‌లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది ఇరాన్.. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ కథ ముగిసిందని అంతా భావించారు.అలా అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. యుద్ధంలోకి దిగాము...విజయమా..వీర మరణమా అనే లెవెల్లో మిస్సైల్స్ కు ఎదురెళ్లి నిలుస్తోంది ఖమేనీ సైన్యం.
ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని ట్రంప్ ప్రకటించడమే ఆలస్యం. అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గూబ గుయ్ మనేలా చేస్తోంది. తమను తక్కువ అంచనా వేయొద్దని అటు అమెరికా..ఇటు ఇజ్రాయెల్ కూడా ఊహించని దాడులు చేస్తోంది.. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు బ్రదర్.. మేమంటూ ట్రంప్‌కు కౌంటరిచ్చింది ఇరాన్. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు..ఆరు నెలలైనా కంటిన్యూ చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పింది ఇరాన్. ఇప్పుడు మాత్రం పదేళ్లు అయినా సరే.. యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారికి కూడా వాతలు పెడతామని చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది.
ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ సమయంలో ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చారు. ఇరాన్ చమురు నిల్వలపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో.. అది ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్‌లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాలు ట్రంప్‌ను చాకిరేవు పెడతారు.. ఆ ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది పలువురు విశ్లేషకులు చెప్తున్న మాట. బట్ వార్ మొదలయ్యాక నువ్వు తగ్గినా నేను తగ్గేదేలే అని ఇరాన్ దేనికైనా సై అంటోంది..అమెరికా ఇజ్రాయెల్.. ఇరాన్ ను సమాధి చేశామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ..ఇరాన్ మాత్రం ఇన్ సైడ్ వార్ ఇరగదీస్తోంది. అత్యంత వ్యూహాత్మక ఆర్థిక దాడి చేస్తూ అమెరికాకే వణుకు పుట్టిస్తోంది. గల్ఫ్ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇజ్రాయెల్ అంతు చూస్తానని శపథం చేస్తోంది.
ఇరాన్‌పై దాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫస్ట్ ఖండించారు. మరి అటువంటి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది. అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్‌తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్‌కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్‌గా మారింది.
Follow Us