'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్‌, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు.

New Update
khameni

గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్‌, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు. ఐదేళ్లలో తొలిసారిగా శుక్రవారం ఆయన ఉపన్యాసంలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై ఇటీవల జరిగిన క్షిపణి దాడులను సమర్థించారు. హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా మరణం తనను బాధించిందని వ్యాఖ్యానించారు.   

Also read: ఘోర ప్రమాదం... 78మంది మృతి!

'' హమాస్, హెజ్‌బొల్లాలపై ఇజ్రాయెల్ విజయం సాధించదు. నస్రల్లా మనమధ్య లేనప్పటికీ కూడా ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ మనకు స్పూర్తినిస్తుంది. ఆయ బలిదానం వృథా కాదు. శత్రువు ప్రణాళికలను భగ్నం చేస్తాం. వారికి వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలని'' ఖమేనీ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా.. ఇటీవల హెజ్‌బొల్లా నస్రల్లా ఇజ్రాయెల్ దాడిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే నస్రల్లా సంస్మరణగా టెహ్రాన్‌లో నిర్వహించిన కార్యక్రంలో.. ఇజ్రాయెల్‌పై చేసిన క్షిపణి దాడులు ప్రజాసేవలో భాగమేనని ఖమేనీ సమర్థించుకున్నారు. ఈ కార్యక్రమానికి కూడా వేలాదిమంది హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్‌లు పరస్పర హెచ్చరికలు చేసుకోవడంతో పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు