Putin: ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్‌ కీలక వ్యాఖ్యలు!

అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ పై రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
putin

Putin: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడి పై రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే ఇటీవల ఆయన పై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్‌..ప్రస్తుతం ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్‌ కీలక నిర్ణయం!

కజకిస్థాన్‌ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ట్రంప్‌ పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు.

Also Read: మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు!

ఆయన కుటుంబాన్ని పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకటి కంటే ఎక్కువసార్లు ఆయన పై హత్యాయత్నాలు జరగడం విచారకరం.నా ఆలోచన ప్రకారం..ఇప్పడు ట్రంప్‌ ఏ మాత్రం సురక్షితంగా లేరు.అయితే ఆయన తెలివైన వ్యక్తి.

Also  Read: PASSPORT: రెండు రోజుల్లోనే పాస్​పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి

ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా అని పుతిన్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌ కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన అనుమతులపై పుతిన్‌ తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచే నిర్ణయమని ఆగ్రహించారు.

Also Read: Ap News: ఈగల్‌ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే!

ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక దీనికి పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌ కు తాము అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు బైడెన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మాస్కో తీవ్రంగా ఖండించింది.

తమ దేశం  పైకిక్షిపణులు వస్తే తగిన విధంగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అన్నట్లుగానే ఇటీవల కీవ్‌ పై రష్యా సేనలు దూకుడు పెంచాయి. క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు