PM Modi : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మోదీని కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాల గురించి చర్చించారు.

author-image
By Bhavana
New Update
president

Modi-Biden : రెండేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ భారత్‌ ని కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు. బైడెన్‌ తన స్వస్థలం విల్మింగ్టన్‌(వాషింగ్టన్‌కు 170 కిలోమీటర్ల దూరం)లో క్వాడ్‌ నాయకుల భేటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఫిలడెల్ఫియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి.. భారతీయ-అమెరికన్ల నుంచి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన నేరుగా విల్మింగ్టన్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆహ్వానించారు. విల్మింగ్టన్‌లో క్వాడ్‌ నేతల సమావేశానికి ముందు.. మోదీ-బైడెన్‌ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని గురించి బైడెన్‌ మోదీతో ప్రస్తావించారు. యుద్ధాన్ని నిలువరించే అంశంపై భారత్‌ చొరవ తీసుకోవాలని ఆయన మోదీని కోరారు. ప్రధాని మోదీ కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తన ఇటీవలి భేటీ గురించి బైడెన్‌కు తెలిపారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో చైనా చర్యల పైనా ఇరువురు నేతలు చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ తెలిపారు. ఇరువురు నేతలు భద్రత, సాంకేతికత, ఆర్థిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 

భారత్‌ కొనుగోలు చేయనున్న 31 ప్రిడేటర్‌ డ్రోన్లపైనా ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. అంతరిక్ష రంగంలో సహకారం.. ఇతర అంశాలపైనా ఇరువురు నేతలు కొద్ది సేపు చర్చించారు. మోదీ కూడా తమ ద్వైపాక్షిక చర్చలు భారత పౌరులు, ప్రపంచ మేలు కోసం ఉద్దేశించినవని ఆయన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. 

కాగా.. ఆదివారం ఉదయం మోదీ న్యూయార్క్‌ చేరుకుంటారు. అక్కడ లాంగ్‌ ఐలాండ్‌లో ‘మోదీ అండ్‌ యూఎస్‌’ పేరుతో భారతీయ అమెరికన్లు నాసా వెటరన్స్‌ మెమోరియల్‌ కొలీజియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి 14 వేల మంది హాజరవుతారని అంచనా. మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పలు అమెరికా సంస్థలు, కంపెనీలకు సీఈవోలుగా ఉన్న భారత సంతతి అమెరికన్లతో ఆయన సమావేశమై.. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సెమీ కండక్టర్ల రంగంపై చర్చించే అవకాశాలున్నాయి.

Also Read :  పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్‌ సంచలన కామెంట్స్‌..

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.

New Update
Zelensky

Zelensky

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

Ukraine Comments On Crimea

క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump 

Advertisment
Advertisment
Advertisment