Iran-America: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం

అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇరాన్‌ ప్రాంతంలో ఉన్న కీలకమైన క్షిపణి కేంద్రాలను, సముద్రంలో మైన్స్‌ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించింది.

New Update
iran america

iran america

మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇరాన్‌ ప్రాంతంలో ఉన్న కీలకమైన క్షిపణి కేంద్రాలను, సముద్రంలో మైన్స్‌ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ విషయాన్ని అమెరికా సైనిక విభాగమైన యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఆత్మరక్షణలో భాగంగా ఈ దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది. తమ బలగాలకు, దేశ ప్రయోజనాలకు ముప్పు కలిగించే కీలకమైన స్థావరాలను గుర్తించి.. వాటిపైనే ఈ దాడులు నిర్వహించినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ టిమ్‌ హాకిన్స్‌ వెల్లడించారు. భవిష్యత్తులో జరగబోయే ముప్పులను ముందే అడ్డుకోవడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

బలగాల రక్షణ విషయంలో..

ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. ఈ సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు పెరగకూడదని అమెరికా సంయమనం పాటిస్తోంది. అయినప్పటికీ తమ బలగాల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కెప్టెన్‌ టిమ్‌ హాకిన్స్‌ స్పష్టం చేశారు. చర్చల ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తూనే.. తమ సైనికులకు ముప్పు వాటిల్లితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

ఇరాన్‌కు చెందిన సముద్ర దళం సముద్రంలో ప్రమాదకరమైన మైన్స్‌ను అమరుస్తూ, వాణిజ్య నౌకలకు, అమెరికా సైనిక నౌకలకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీనిని అడ్డుకోవడానికి అలాంటి బోట్లను గుర్తించి వాటిని నాశనం చేయడం ద్వారా సముద్ర భద్రతను కాపాడుకోవాలని అమెరికా భావిస్తోంది. క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ దూకుడును అదుపులోకి తీసుకురావాలని అమెరికా ఈ దాడులు నిర్వహించింది.

ఇది కూడా చూడండి: Pawan Kalyan : శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు... ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలనం!

Advertisment
తాజా కథనాలు