/rtv/media/media_files/2026/02/21/fotojet-32-2026-02-21-19-44-34.jpg)
US IRAN WAR
US IRAN WAR : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోందా..! ఒకవేళ ఇరాన్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయితే ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు..అది ఓ సామాన్యుడి జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం.
సాధారణంగా యుద్ధం అంటే 2 దేశాల సైన్యాలు తలపడుతాయి. కానీ ఇక్కడ అమెరికా ప్లాన్ వేరు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని దెబ్బ తీయడమే అమెరికా ముందున్న లక్ష్యం. ఇరాన్ తను అణు కార్యక్రమాలను ఆపడం లేదని, అందుకే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆయన వారసులను అంతం చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
మరీ అమెరికా దాడి చేస్తే ఇరాన్ సైలెంట్‌గా ఉండదు. ఇరాన్ దగ్గర ప్రస్తుత వేల సంఖ్యలో మిస్సైల్స్ ఉన్నాయి. ఈ మిస్సైల్స్‌తో అమెరికాకు సపోర్ట్ చేస్తున్న ఇజ్రాయెల్‌తో పాటు అరబ్ దేశాలపై దాడి చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ యుద్ధం ఒక దేశంతో మొదలై ప్రపంచమంతా పాకే ప్రమాదం ఉంది.
మీరు అనుకోవచ్చు..ఎక్కడో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరిగితే ఇండియాపై ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని. కానీ ఇక్కడే అసలు సమస్య. ప్రపంచానికి అవసరమైన మొత్తం చమురులో 20% హోర్ముజ్ జలసంధి అనే చిన్న సముద్ర మార్గం గుండా వస్తుంది. ఇది ఇరాన్‌కు పక్కనే ఉంటుంది. అమెరికా యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇరాన్ ఈ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తుంది. అప్పుడు చమురు రవాణా ఆగిపోతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా డబుల్ అవుతాయి. రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. ఫలితంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతాయి.
ఈ యుద్ధం కేవలం అమెరికా-ఇరాన్‌లతో ఆగిపోదు. రష్యా, చైనా ఇరాన్‌కు మద్దతు ఇవ్వొచ్చు. అప్పుడు ఇది థర్డ్ వరల్డ్ వార్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. మరోవైపు, ఇరాన్ తన వద్ద ఉన్న అణు సామర్థ్యాన్ని ప్రయోగిస్తే..అది మానవాళికే ముప్పు. అంటే, కేవలం ఒక దేశం అహంకారం వల్ల ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది."
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఇరాన్‌ను భయపెట్టి ఒప్పందానికి తీసుకురావాలా..? లేక ఇరాన్‌పై యుద్ధానికి దిగాలా.! అని యుద్ధం వల్ల ఎవరూ గెలవరు, కేవలం ఓడిపోయేది సామాన్యుడు మాత్రమే. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు సఫలం కావాలని ప్రపంచం కోరుకుంటోంది.
Follow Us