/rtv/media/media_files/2025/03/22/pMLjruH2SQN3tXsph8pX.jpg)
Trump
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ఇటీవల వాళ్ల స్వదేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపించిన సంగతి తెలిసిందే. అందులో మన భారతీయులు కూడా ఉన్నారు. అయితే తాజాగా ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన 5,32,000 మంది వలసదారులకు చట్టపరమైన రక్షణ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు నెలరోజుల్లోనే వాళ్లని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు చెప్పింది.
Also Read: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
2022 అక్టోబర్ తర్వాత కూడా క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాల నుంచి అమెరికాకి వలస వచ్చినవాళ్లకి ఈ బహిష్కరణ ముప్పు ఎదురైంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ సర్కార్ మరోసారి 5 లక్షల మందికి పైగా బహిష్కరించనుంది. ట్రంప్ అధికారంలోకి రాకముందు.. అక్రమ వలసదారులను పంపిచివేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు అయిన తర్వాత అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం కన్నెర్ర జేస్తోంది. ఇప్పటికే భారత్, మెక్సికో తదితర దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని విడతల వారీగా స్వదేశాలకు పంపించింది.
Also Read: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!
trump | telugu-news | Immigrants | usa