TRUMP 15 POINTS : యుద్ధం ఆపేందుకు ట్రంప్‌ నానా తంటాలు..15 సుత్రాలతో శాంతి ప్రణాళిక

గడచిన నెల రోజులుగా  ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్‌ తో సంధికోసం ట్రంప్‌ అనేక తిప్పలు పడుతున్నాడు. దీనికోసం 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపాడు.

New Update
Donald Trump

Donald Trump.. A peace plan with 15 principles

TRUMP 15 POINTS : గడచిన నెల రోజులుగా  ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్‌ తో సంధికోసం ట్రంప్‌ అనేక తిప్పలు పడుతున్నాడు. యుద్ధానికి ముగింపు పలికేందుకు  అమెరికా కీలక ముందడుగు వేసింది. యుద్ధాన్ని నిలిపివేసి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపింది. మరోవైపు, ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతి ప్రణాళికలు అంటూనే ఇరాన్‌కు 15 డిమాండ్లు పంపించారు.

అందులో ప్రధానంగా కొన్ని డిమాండ్లు పొందుపరిచారు. మొదటగా నెల రోజులు సీస్ ఫైర్‌కు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే 3 అణుకేంద్రాలు నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను పూర్తిగా మూసేయాలి..శుద్ధిచేసిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అప్పగించాలి..బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్. హార్ముజ్‌ జలసంధిని ఎట్టిపరిస్థితుల్లోనూ మూసివేయవద్దని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. షరతులకు అంగీకరిస్తే ఇరాన్‌పై అన్ని ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఆంక్షలను తిరిగి విధించే "స్నాప్‌బ్యాక్" విధానం కూడా రద్దు  చేయాలని ట్రంప్‌కోరుతున్నారు. ఇలా చేస్తే బుషెహర్‌లో పౌర అణు ప్రాజెక్ట్ అభివృద్ధికి మద్దతిస్తామని అమెరికా చెబుతుంది. అయితే ట్రంప్ మాటల్ని ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు.ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది.

ఈ షరతులకు అంగీకరిస్తే ఇరాన్‌పై విధించిన అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్‌లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపింది. ఆంక్షలను తిరిగి విధించే "స్నాప్‌బ్యాక్" విధానాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొంది. అయితే, దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోందని, ఇరు దేశాల మధ్య ఇంకా చాలా దూరం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటుండటం గమనార్హం. 

కాగా ట్రంప్ ప్రతిపాధించిన  15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..

అణ్వాయుధాలు: ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.

క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను తగ్గించాలి.

హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.

కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.

ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్‌కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.

సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్‌కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.

నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.

ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.
ఇరాన్ ప్రాక్సీ నెట్‌వర్క్‌ను విడిచిపెట్టాలి.

క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే

Advertisment
తాజా కథనాలు