US passports : అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో...విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని, దేశ అధికారిక పాస్‌పోర్ట్‌లపై డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది.

New Update
FotoJet - 2026-04-29T095118.190

Trump's photo on US passports

US passports : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని, దేశ అధికారిక పాస్‌పోర్ట్‌లపై డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు వస్తున్న వార్తలను అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. జులైలో జరగనున్న చరిత్రాత్మక వేడుకల గుర్తుగా ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లను పరిమిత సంఖ్యలో (Limited Edition) విడుదల చేయనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ప్రకటించారు.

వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన పత్రంపై ట్రంప్ ఫోటో ఉండటంతో పాటు, దాని కింద ఆయన సంతకం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. వీటితో పాటు అమెరికా వ్యవస్థాపక పితామహుల చారిత్రక చిత్రాలు, జాతీయ జెండా రూపకల్పన వంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే పౌరుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాధారణంగా అమెరికా పాస్‌పోర్ట్‌లపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలు లేదా ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. అధికారంలో ఉన్న నాయకుడి ఫోటోను పాస్‌పోర్ట్‌పై ముద్రించడం అమెరికా సంప్రదాయాలకు విరుద్ధమని, ఇది అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 250వ స్వాతంత్య్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్న ఆలోచనలో భాగంగానే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామం ఒక్కటే కాకుండా, అమెరికా కరెన్సీ నోట్లపై కూడా ట్రంప్ సంతకాన్ని ముద్రించబోతున్నట్లు ట్రెజరీ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తద్వారా అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల సందర్భంగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక స్మారక నాణేలను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ ఫోటోతో కూడిన పాస్‌పోర్ట్ చిత్రాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు