Donald Trump : ట్రంప్‌ను పీకేస్తారా? అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణకు పెరుగుతున్న డిమాండ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్టర్ పర్వదినం వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు అందులో వాడిన అత్యంత అభ్యంతరకరమైన, బూతు పదజాలం చూసి అంతా విస్తుపోతున్నారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్టర్ పర్వదినం వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు, అందులో వాడిన అత్యంత అభ్యంతరకరమైన, బూతు పదజాలం చూసి అంతా విస్తుపోతున్నారు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తామని, ఆ దేశం నరకాన్ని చూస్తుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా విరుచుకుపడ్డారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష వాడటంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ప్రవర్తన దేశ భద్రతకు ముప్పుగా మారుతోందని భావిస్తున్న డెమోక్రాట్ నేతలు, ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణలో ఉన్న సెక్షన్ 4ను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ స్పందిస్తూ.. తాను గనుక ట్రంప్ క్యాబినెట్‌లో ఉంటే, ఈస్టర్ రోజే రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి ఈ సవరణను అమలు చేసేవాడినని, ఇది పూర్తిగా పిచ్చి చర్య అని విమర్శించారు. మాజీ హోస్ట్ మెహదీ హసన్ సైతం ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ వెంటనే రంగంలోకి దిగి ట్రంప్‌ను తప్పించాలని కోరారు.

అసలేమిటి ఈ 25వ సవరణ?

1967లో జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య తర్వాత అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణను చేర్చారు. ఒకవేళ అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా లేదా పదవి నుంచి తొలగించబడినా అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేసే ప్రక్రియను ఇది వివరిస్తుంది. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా, ప్రస్తుతం చర్చనీయాంశమైన 'సెక్షన్ 4' అత్యంత కీలకమైనది.

ఒకవేళ అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించలేనంతగా శారీరక లేదా మానసిక అశక్తతకు గురయ్యారని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌లోని మెజారిటీ సభ్యులు భావిస్తే, వారు లిఖితపూర్వక ప్రకటన ద్వారా అధ్యక్షుడిని పక్కన పెట్టి, ఉపాధ్యక్షుడిని 'తాత్కాలిక అధ్యక్షుడు'గా నియమించవచ్చు.

ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ తరచూ మాట మార్చడం, స్పష్టమైన వ్యూహం లేకపోవడం మరియు తాజా బూతు పోస్ట్ ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయని పలువురు ఎంపీలు వాదిస్తున్నారు. ఇరాన్ దాడులు కొనసాగుతున్న తరుణంలో అధ్యక్షుడి ఇలాంటి తీరు ప్రపంచ శాంతికి ముప్పు అని వారు ఆందోళన చెందుతున్నారు. అటు రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్ విధానాలపై అసమ్మతి మొదలవ్వడంతో, అమెరికా రాజకీయాల్లో ఈ '25వ సవరణ' అంశం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు