వేలాది అమెరికా సైనికులను బలి ఇస్తున్న ట్రంప్.. ఇరాన్‌లో భయంకరమైన ఆపరేషన్

ఇరాన్‌తో శాంతి చర్చల మాట పక్కన పెట్టి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆధిపత్యం కోసం వేల మంది అమెరికా సైనికులను బలివ్వడానికి రెడీ అయ్యాడు. పంతానికి పోయి చరిత్రలోనే ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన మిషన్‌ ట్రంప్ చేపట్టబోతున్నాడు.

New Update
Trump orders

ఇరాన్‌తో శాంతి చర్చల మాట పక్కన పెట్టి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆధిపత్యం కోసం వేల మంది అమెరికా సైనికులను బలివ్వడానికి రెడీ అయ్యాడు. పంతానికి పోయి ఆధునిక యుద్ధ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన మిషన్‌ ట్రంప్ చేపట్టబోతున్నాడు. ఆ ప్లాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల్లోకి చొరబడి, అక్కడ పూడ్చిపెట్టిన యురేనియం నిల్వలను తవ్వి తీయాలని ట్రంప్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓ డేంజరస్ ఆపరేషన్‌కు అగ్రరాజ్యం సిద్ధమవుతుంది.

'యురేనియం తవ్వకం' మిషన్?

గతంలో జరిగిన వైమానిక దాడుల వల్ల ఇరాన్‌కు చెందిన సుమారు 450 కిలోగ్రాముల (1000 పౌండ్లు) యురేనియం (UF6) ప్రస్తుతం ఇస్ఫహాన్, నతాంజ్ ప్రాంతాల్లోని పర్వత శిథిలాల కింద కూరుకుపోయింది. కేవలం బాంబులతో సరిపెట్టకుండా, ఆ 'అణు ధూళి'ని శాశ్వతంగా అమెరికాకు తరలించాలని ట్రంప్ భావిస్తున్నారు. అక్కడికి వెళ్లి ఆ యురేనియంను స్వాధీనం చేసుకోండని ఆయన సైనికులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

సైనికుల ఎముకలు కరిగించే రసాయన మృత్యువు!

ఈ మిషన్ వినడానికి బానే ఉన్నా, చేయాలంటే ఇది అమెరికా సైనికులకు ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అటుఇటు అయినా వేల మంది అమెరికన్ సోల్జర్స్ ఘోరంగా చనిపోతారు. వారి ప్రాణాలు అటునుంచి అటే గాల్లో కలిసిపోతాయి. 

హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం: యురేనియంలోని హెక్సాఫ్లోరైడ్ గాలితో కలిస్తే అత్యంత విషపూరితమైన హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది మనిషి ఊపిరితిత్తులను కాల్చివేయడమే కాకుండా, శరీరంలోని ఎముకలను సైతం కరిగించేస్తుంది.

రేడియేషన్ ముప్పు: 60% పైగా ప్యూరిఫికేషన్ చేసిన యురేనియం తరలించేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా, అది ప్రాణాంతకమైన గామా కిరణాలను విడుదల చేస్తుంది. ఇది సెకన్ల వ్యవధిలోనే సైనికుల ప్రాణాలను తీయగలదు.

యుద్ధ క్షేత్రంగా మారనున్న ఇరాన్ అణు కేంద్రాలు

రిటైర్డ్ జనరల్ జోసెఫ్ వోటెల్ వంటి వార్ ఎక్స్‌పర్ట్‌లు ఈ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ మిషన్ కోసం అమెరికాకు చెందిన '82వ ఎయిర్‌బోర్న్ డివిజన్',  'రేంజర్స్' దళాలు ఇరాన్ గడ్డపైకి పారాచూట్ల ద్వారా దిగాల్సి ఉంటుంది. అక్కడ తాత్కాలిక విమానాశ్రయాన్ని నిర్మించి, భారీ క్రేన్లతో తవ్వకాలు జరపాలి. ఇది వెళ్లి వెంటనే పూర్తి చేసుకొని వచ్చే మిషన్ కాదు. వందలాది మంది సైనికులు వారాల తరబడి ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల మధ్య అక్కడే తిష్టవేయాల్సి ఉంటుంది. "ఇరాన్ వద్ద మిగిలింది కేవలం అణు ధూళి మాత్రమే, దాన్ని కూడా వదిలిపెట్టం" అని ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారు. అయితే, ఈ ఆపరేషన్ ఫైయిల్ అయితే ప్రపంచంలోని అధిక భాగం రేడియోధార్మిక శిథిలాలుగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది అమెరికా సాధించే విజయమా లేక వేలాది మంది సైనికులను బలితీసుకునే అతిపెద్ద తప్పిదమా అనేది కాలమే నిర్ణయించాలి.

Advertisment
తాజా కథనాలు