Donald Trump : నేను రేపిస్టును కాదు.. ఫీమేల్ యాంకర్ పై ట్రంప్ ఫైర్..  వీడియో వైరల్ !

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా జరిగిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఫీమేల్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

New Update
trump and anchor

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా జరిగిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఫీమేల్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను రేపిస్టును కాదు, ఆ మాట నువ్వు చదవాల్సింది కాదు అంటూ కెమెరా ముందే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే, ట్రంప్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ పార్టీలో కాల్పులు జరిపిన నిందితుడు కోల్ అలెన్, అంతకుముందే ఒక లేఖను సిద్ధం చేసుకున్నాడు. అందులో అతను ట్రంప్ పరిపాలనలోని అధికారులనే టార్గెట్ చేస్తానని, ఒక పిడోఫైల్ (పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు), రేపిస్ట్, దేశద్రోహి అని తాను భావించే వ్యక్తి పాపాలతో తన చేతులు తడుపుకోలేనని రాశాడు.

ఈ నిందితుడి ప్రకటనను యాంకర్ ఓ డోనెల్ లైవ్ ఇంటర్వ్యూలో చదివి వినిపిస్తూ  దీనిపై మీ స్పందన ఏంటని ట్రంప్‌ను అడిగారు. అది విన్న వెంటనే ట్రంప్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. నువ్వు కచ్చితంగా ఆ ముక్క చదువుతావని నాకు తెలుసు, ఎందుకంటే మీరంతా చాలా చెడ్డవాళ్లు. ఆ షూటర్ ఒక మానసిక రోగి. వాడు రాసిన పిచ్చి మాటలను నువ్వు 60 మినిట్స్ లాంటి పెద్ద ఇంటర్వ్యూలో చదవకూడదు. నువ్వు చాలా దారుణమైన వ్యక్తివి అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఇంటర్వ్యూను కొనసాగిద్దాం పద అంటూ అసహనంగానే ముందుకు సాగారు.

నిజానికి ఆ షూటర్ రాసిన లేఖలో నేరుగా ట్రంప్ పేరు ఎక్కడా లేదు. కానీ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న పాత పరిచయాల వల్ల, ఆ ఆరోపణలు ట్రంప్ గురించేనని మీడియాలో చర్చ జరుగుతోంది. ఎప్‌స్టీన్ గతంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి, 2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్ లో కూడా ట్రంప్ పేరు అప్పుడప్పుడు ఎప్‌స్టీన్ ఇంటికి వచ్చే అతిథిగా ఉంది. ఈ పాత గతాన్ని షూటర్ తన లేఖలో ప్రస్తావించడంతో ట్రంప్ తీవ్రంగా ఫీలయ్యారు.

యాంకర్‌పై సెటైర్లు

ఇక ఇంటర్వ్యూ మొత్తం ట్రంప్ ఆ యాంకర్‌పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. నిందితుడు గతంలో నో కింగ్స్ అనే నిరసనల్లో పాల్గొన్నాడని యాంకర్ గుర్తు చేయగా, ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు. నీలాంటి వాళ్లు ఉండబట్టే అలాంటి మనుషులు తయారవుతున్నారు. నేను రాజును కాదు, ఒకవేళ నిజంగానే నేను రాజును అయి ఉంటే ఇప్పుడు నీతో ఇలా కూర్చుని మాట్లాడేవాడినే కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు