/rtv/media/media_files/2026/03/10/trump-family-2026-03-10-15-07-55.jpg)
రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొనగా.. ట్రంప్ ఫ్యామిలీ మాస్టర్ మైండ్‌లో బిజినెస్ చేస్తోంది. రక్షణ రంగం, ముఖ్యంగా డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన ట్రంప్ కుమారులు, తాజాగా ఓ ప్రముఖ డ్రోన్ సంస్థలో ప్రధాన వాటాదారులుగా చేరారు.
పవరస్ సంస్థలో వాటాలు
ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు 'పవరస్' అనే డ్రోన్ తయారీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ ఇటీవల ఫ్లోరిడాలో గోల్ఫ్ కోర్సులను నిర్వహించే ‘అరియాస్ గ్రీన్‌వే హోల్డింగ్స్’ అనే సంస్థతో విలీనమైంది. విలీనం తర్వాత కూడా ఈ సంస్థ పేరు 'పవరస్' గానే కొనసాగుతోంది. ఈ కంపెనీ కేవలం సాధారణ డ్రోన్లనే కాకుండా, అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలిగే లెటెస్ట్ డ్రోన్లను తయారు చేస్తోంది. ఇవి అటు మిలిటరీ అవసరాలకు, ఇటు పౌర అవసరాలకు ఉపయోగపడతాయి.
వరుస పెట్టుబడులు
ట్రంప్ కుటుంబానికి డ్రోన్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ట్రంప్ జూనియర్ ‘అన్‌యూజువల్ మెషిన్స్’ అనే స్టార్టప్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం అమెరికాకు ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో వార్‌ఫేస్‌ని మార్చేసే డ్రోన్ల తయారీపై ట్రంప్ కొడుకులు ఆసక్తి చూపడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. "భవిష్యత్తు యుద్ధాలు ఆయుధాల కంటే ఎక్కువగా సాంకేతికతపై, ముఖ్యంగా డ్రోన్లపై ఆధారపడి ఉంటాయని ఈ పెట్టుబడులు సూచిస్తున్నాయి." ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఫ్యామిలీ రక్షణ రంగంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Follow Us