/rtv/media/media_files/2025/01/22/0sMcdkMCves8ECVNdDGG.jpg)
Trump administration Photograph: (Trump administration)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. వందల ఫైళ్లపై మొదటి రోజు సంతకాలు చేసి పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (డీఈఐ) సిబ్బంది అందరినీ బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా (అమెరికా కాలమానం ప్రకారం) వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి.
ఇది ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఎంత మందిపై ప్రభావం చూపనుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఇక బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్మత: పౌరసత్వం, డబ్ల్యూహెచ్ నుంచి యూఎస్ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
డబ్ల్యూహెచ్‌వో కు గుడ్‌బై..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కరోనా వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అతిపెద్ద డోనర్. అమెరికా తప్పుకోవడం వల్ల డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు స్తంభించిపోతాయి.
1500 మందికి క్షమాభిక్ష
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. అంతేకాకుండా ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని యూఎస్ అటార్నీ జనరల్‌ను కూడా నిర్దేశించారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల టైమ్ లో ట్రంప్ ప్రకటించగా తాజాగా ఆ దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్