Donald Trump : సమయం లేదు మిత్రమా...విజయమో..మరణమో తేల్చుకో... ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్

తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్‌ గతంలో ఇచ్చిన గడువు దగ్గరపడిందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని హెచ్చరించాడు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశాడు.

New Update
Open Strait Of Hormuz Within 48 Hours Trump Warns iran

Open Strait Of Hormuz Within 48 Hours Trump Warns iran

Donald Trump : ఇరాన్‌ పై అమెరికా సాగిస్తు్న్న యుద్ధం మరింత ఉధృతమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్‌ ఇరాన్‌కు వరుసగా డెడ్‌ లైన్‌లు విధిస్తూ వస్తున్నప్పటికీ ఇరాన్‌ ఏమాత్రం వెనుకకు తగ్గటం లేదు. తాజాగా మరోసారి ట్రంప్‌ 48 గంటల డెడ్‌ లైన్‌ విధించాడు. హార్మూజ్‌తెరవాలని, మాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ వార్నింగ్‌ ఇచ్చాడు.  తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు  ట్రంప్‌ గతంలో ఇచ్చిన పది రోజుల గడువు దగ్గరపడిందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని హెచ్చరించాడు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధవిమానాన్ని ఇరాన్‌ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్లు ఇరాన్‌ పేర్కొంది.. తమ గగనతలంపై పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్‌ సైన్యం స్పష్టం చేయడం గమనార్హం.

  ఇదిలా ఉండగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరం కరాజ్‌తో కలిపే ప్రధాన హైవే వంతెన పై అమెరికా వైమానికి దాడులకు పాల్పడింది. దాన్ని నిర్ధారిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కూలిపోయిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దర వ్యక్తులు చనిపోయారని ఇరాన్‌ వర్గాలు తెలిపాయి. కాగా ఇరాన్‌ ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ సమయం మించిపోకముందే ఇరాన్ చర్చలకు రావాలని, లేదంటే ఆ దేశం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని  హెచ్చరించారు.  

ఈ ఘటనపై స్పందించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ పౌర నిర్మాణాలపై దాడులు చేసినంత మాత్రాన ఇరానియన్లు లొంగిపోతారనుకోవడం అమెరికా పిచ్చికల అన్నారు. ఒకవైపు దాడులు జరుగుతున్నా, ఇరాన్ తన పంతాన్ని వీడకుండా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలో ఉంచుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుండటంతో, ఇరాన్ దీనిని ఒక వ్యూహాత్మక అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే అంశంపై బ్రిటన్ అన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. హార్మూజ్ జలసంధిని శక్తితో స్వాధీనం చేసుకోవచ్చని, కానీ ఆ పని అమెరికా చేయదని ఆయన స్పష్టం చేశారు. ఆ మార్గం ద్వారా చమురు పొందే దేశాలే ధైర్యంగా ముందుకు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు.  

Advertisment
తాజా కథనాలు