NTR : ఆ మాట నన్నుకదిలించింది....జపాన్ అభిమాని తెలుగుకు ఫిదా ఐన ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ.. మార్చి 28న జపాన్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేశారు.

New Update
 Jr NTR

Jr NTR

NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. కొరటాల శివ  దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాగా వచ్చిన ఈ మూవీ.. మార్చి 28న జపాన్‌లో రిలీజ్ కానుంది. దీంతో జపాన్‌లో  ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు సినిమా నిర్మాతలు. ఇందులో భాగంగా తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ అభిమానులను కలిసి ముచ్చటించిన ఎన్టీఆర్.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. తాజాగా X వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: నా భర్త చాలా మంచోడు.. కన్నీరు పెట్టిస్తోన్న ప్రవీణ్ భార్య మాటలు!

‘నా జపాన్ సందర్శనలు నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తాయి.. కానీ ఈ  సందర్శన మాత్రం నాకు ఎప్పటికి గుర్తిండి పోతుంది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. ఆ మాట నిజంగా నన్ను కదిలించింది. ఒక కల్చర్‌కు, ప్రేమకు సినిమా ఈరోజు వారధిగా నిలిచింది. అందుకే ఆ అభిమానిని సినిమా శక్తి భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించింది. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. భారతీయ సినిమా ప్రపంచాన్ని పర్యటించేందుకు ఇది ఒక నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO

కాగా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ జపాన్ అభిమాని తెలుగు మాట్లాడి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపరిచింది. ''అన్నా నేను RRR సినిమా చూశాక తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల నుంచి తెలుగు నేర్చుకుంటున్నాను అంటూ.. ఆమె తెలుగులో రాసిన పుస్తకాన్ని చూపించింది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫిదా అయ్యారు. ''మీరు నిజంగా ఒక స్ఫూర్తి'' అంటూ ఆ మహిళా అభిమానిని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను తారక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

Advertisment
Advertisment
Advertisment