/rtv/media/media_files/2026/03/28/iran-drone-attack-on-kuwait-international-airport-2026-03-28-18-15-22.jpg)
Iran Attacks on Kuwait
Iran Attacks on Kuwait: ఒకవైపు రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని చెబుతున్న ఇరాన్ చేతల్లో మాత్రం ఏ మాత్రం వెనకకు తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నా ఇరాన్ అమెరికాపై డైరెక్ట్ అటాక్స్ చేయకుండా.. దానికి ఎయిర్ బేసెస్ విషయంలో సాయం చేస్తోన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. తాజాగా ఇరాన్ కువైట్ లోని అత్యంత కీలక ప్రాంతాలే టార్గెట్ గా దాడులు చేసింది. కువైట్‌తో పాటు దుబాయ్‌లపై భీకర దాడులకు పాల్పడింది. దుబాయ్, కువైట్‌లోని ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది.
అలాగే ఆయా దేశాల్లోని పవర్ ప్లాంట్‌లపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి దిగింది. అయితే దుబాయ్ మాత్రం ఇరాన్ మిసైళ్లను పేల్చేసినట్లు ప్రకటించింది. సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగిన కాసేపటికే ఇరాన్ దాడులు చేయడం గమనార్హం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరగడానికి ముందు ఇరాన్‌లోని..లావెన్ రిఫైనరీపై భీకర దాడులు జరిగాయి. లావెన్ రిఫైనరీపై దాడులకు ప్రతీకారంగానే..దుబాయ్, కువైట్‌పై దాడులు చేశామని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో అసలు సీజ్‌ఫైర్ ఉందా, లేదా..?అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. సీజ్‌ఫైర్ జరిగినా దాడులు ఎందుకు ఆగట్లేదు..! అనేది అందరికీ అంతుబట్టని ప్రశ్నం.ఇరాన్ దాడులపై అమెరికా, ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటి? అనేది తేలాల్సి ఉంది.
Follow Us