/rtv/media/media_files/2026/02/12/elections-in-bangladesh-2026-02-12-13-21-49.jpg)
Bangladesh
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సుదీర్ఘకాలం పాలించిన షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పోటీలో లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ప్రస్తుతం ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఇ-ఇస్లామీ కూటమి మధ్యే నెలకొంది.
#WATCH | Bangladesh: Long queues of voters witnessed at a polling centre at the Gulshan Model School and College in Dhaka, as they await their turn to cast a vote.
— ANI (@ANI) February 12, 2026
Voting for the 13th Parliamentary elections begins. Parties, including the Bangladesh Nationalist Party, led by… pic.twitter.com/j8HHYzF9pr
లండన్‌లో 17 ఏళ్ల ఉండి వచ్చిన తర్వాత తారిఖ్ రెహమాన్ ఇప్పుడు BNP సారథిగా ఎన్నికల బరిలో నిలిచారు. తన తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం తర్వాత ఆయన పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. తల్లి మరణంతో ప్రజల్లో ఉన్న సానుభూతి ఆయనకు కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశానికి దూరంగా ఉన్న తారిఖ్, బంగ్లాదేశ్ యువత నాడి ఎంతవరకు పట్టుకోగలరనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. పోలింగ్ బూత్‌కు వెళ్లి తారిక్ రెహమాన్ ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన కుమార్తె జైమా రెహమాన్ కూడా గుల్షన్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
Bangladesh: BNP Chairman Tarique Rahman has cast his vote in the 13th parliamentary elections
— IANS (@ians_india) February 12, 2026
(Source: BNP) pic.twitter.com/I3x6BQlJIe
Barister Zaima Rahman, daughter of BNP Chairman Tarique Rahman, has cast her vote at Gulshan Model High School & College center today, Thursday, February 12, 2026. 🌾🇧🇩#VoteForBNP#BNPforWin#BangladeshElections2026#ShobarAgeyBangladeshpic.twitter.com/DOoRd62cBi
— BNP Media Cell (@BNPBdMediaCell) February 12, 2026
Also Read: రష్యాలో వాట్సాప్ బ్లాక్.. MAX యాప్‌తో పుతిన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!
BNP కీలక వాగ్దానాలు
అందరికీ ముందు బంగ్లాదేశ్ అనే నినాదంతో తారిఖ్ రెహమాన్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఏ వ్యక్తి అయినా గరిష్టంగా 10 ఏళ్లు మాత్రమే ప్రధానిగా ఉంటారు. బంగ్లాదేశ్‌లో 100 మంది సభ్యులతో ఎగువ సభ, ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటు, జూలై 2024 హింసపై స్వతంత్ర విచారణ ఆయన మ్యానిఫెస్టోలో ఉన్నాయి. అలాగే విద్యార్థుల డిమాండ్ల అమలు చేస్తానని కూడా ఆయన చెబుతున్నారు. పొరుగు దేశాలతో ఫ్రెండ్షిప్, ముస్లిం దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన ప్రజల ముందకు వెళ్తున్నారు. బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా భారత్‌తో మంచి సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల ఖలీదా జియా మరణించినప్పుడు భారత ప్రధాని మోడీ సంతాపం తెలపడం, విదేశాంగ మంత్రి జైశంకర్ ఢాకాను సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య ప్రాముఖ్యతను చాటిచెప్పింది.
తారిఖ్ రెహమాన్ ముందున్న ఛాలెంజ్
తారిఖ్ రెహమాన్‌కు జమాత్-ఇ-ఇస్లామీ, కొత్తగా ఏర్పడిన NCP నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. యువత ఓట్లు ఎన్సీపీ వైపు, ఇస్లామిక్ మద్దతుదారులు జమాత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2006 తర్వాత మళ్లీ బిఎన్‌పిని అధికారంలోకి తీసుకురావడంలో తారిఖ్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి. ఈ ఎన్నికల ఫలితం అటు అవామీ లీగ్ భవిష్యత్తును, ఇటు తారిఖ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయించనుంది.
Follow Us