Syria: ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు!

సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ రష్యాకు పారిపోయాడు. ఆ తరువాత సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆర్థిక మంత్రి అబ్జాద్‌ చెప్పారు.

New Update
syria jobs

syria jobs

Syria: సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే.ఆ తరువాత సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కొత్త ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అబ్జాద్‌ వెల్లడించారు. 1.65 ట్రిలియన్‌ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు ప్రకటించారు.

Also Read: Ind vs Aus: రోహిత్‌‌ను కావాలనే తప్పించారు: ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయబోతున్నామని మహమ్మద్ అబ్జాద్‌ వెల్లడించారు.కాగా, గత కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని మంత్రి మహమ్మద్ అబ్జాద్‌ తెలిపారు. అయితే, తమ కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్‌ కంట్రీస్ హామీ ఇచ్చాయని పేర్కొన్నారు. 

Also Read: AUS vs IND: పక్కా వ్యూహంతోనే కొన్‌స్టాస్ గొడవ.. అసలు నిజం బయటపెట్టిన పంత్!

400 శాతం మేర జీతాలు..

సిరియాకు చెందిన విదేశాల్లోని 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకొనే దిశగానూ తాము ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, 400 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో సిరియాలోని ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Konstas: బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవ.. చివరి బంతికే వికెట్, కోహ్లీ రియాక్షన్ చూశారా!

Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు