Sunita Williams : అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్ ఓటు!

బోయింగ్ స్టార్‌ లైనర్‌ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా స్సందించారు.అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పారు.

author-image
By Bhavana
New Update
sunita

Sunita Williams :

బోయింగ్ స్టార్‌ లైనర్‌ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష లోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా స్సందించారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్‌ మాట్లాడుతూ…అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలియజేశారు.. 

దేశ పౌరులుగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం అని వారు పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు తాము ఎదురు చూస్తున్నాం.. ఐఎస్‌ఎస్‌లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.. నాకే కాదు ఇది నా ఫ్యామిలీకి చాలా కష్టతరమైన సమయం.. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు.

మరో వ్యోమగామి విల్మోర్‌ మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్‌ రిక్వెస్ట్‌ పంపినట్లు వివరించారు. జూన్‌ 5వ తేదీన బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, విల్‌మోర్‌లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్‌ ప్రకారం భూమికి తిరిగి రాలేదు.

Also Raed: ఒక్కరోజే 1200 పెరిగిన బంగారం..వెండి ఎలా ఉందంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు