America: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్‌ జెట్‌!

రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి

New Update
spacejet

America : రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియోను సైనిక అధికారులు విడుదల చేశారు. మాస్కో విమానాన్ని వెనక్కి పంపడానికి అమెరికా కూడా ఎఫ్‌ -16 ఫైటర్‌ జెట్‌ ను రంగంలోకి దించారు. ఈ వీడియోలో రష్యాకు చెందిన ఫైటర్ జెట్‌ అమెరికా విమానానికి కొన్ని అడుగుల దూరం వరకు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఘటన నార్తర్న్‌ అమెరికన్‌ ఏరోస్పేస్‌ కమాండ్ పరిధిలో సెప్టెంబర్‌ 23న జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి. '' రష్యాకుచెందిన సు-35 విమానం అసురక్షితంగా ప్రయాణించింది. ఇది ఏమాత్రం ప్రొఫెషనల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లా అనిపించలేదు'' అని ఆ కమాండ్‌ అధిపతి జనరల్‌ గ్రెగరీ గ్యూలాంట్ పేర్కొన్నారు.

ఈ అంశం పై రష్యా దౌత్య కార్యాలయానికి కూడా ఈ ఘటన పై సమాచారం పంపించారు. ఇటీవల ఎనిమిది రష్యా ఫైటర్‌ జెట్లు, నాలుగు యుద్ధ నౌకలు, రెండు జలాంతర్గాములు అమెరికా భూభాగం దిశగా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో రెండు సబ్‌మెరైన్లు ఒక ఫ్రిగెట్‌, ఒక టగ్‌బోట్‌ ఉన్నట్లు అమెరికా తీర భద్రత దళం నాడు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవి సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్ల లోపలికి వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాల పరిధికి వెలుపల ఉన్న యూఎస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ లో ఇవి ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. 

Also Read: మిస్టర్ రంగనాథ్‌..అంటూ జడ్జి ప్రశ్నల వర్షం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 20 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Russia Attacks on Ukraine

Russia Attacks on Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగ వేళ ఆదివారం స్థానికులంతా ఓ చోటు చేరగా.. రెండు క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పారు. పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.       

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న సందర్భంగా ఈ దాడులు జరిగాయి. సుమీ నగరంపై జరిగిన ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుందని.. ఈ దాడుల్లో నివాసాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

అలాగే ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. రష్యా ఉగ్రచర్చలను కోరుకుంటుందని.. యుద్ధాన్ని లాగుతోందని ఆరోపణలు చేశారు. రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా శాంతిని నెలకొల్పడం అసాధ్యమన్నారు. మాస్కో విషయంలో చర్చలు దాడులను నిలువరించలేకపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఓ ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో రష్యా పట్ల అలాంటి వైఖరే అవసరమని తెలిపారు. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

Also Read: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

telugu-news | rtv-news | russia-ukraine-war | international 

Advertisment
Advertisment
Advertisment