/rtv/media/media_files/2026/05/28/fotojet-12-2026-05-28-10-07-17.jpg)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 5 లక్షల మంది రష్యన్ సైనికులు మృతి చెంది ఉంటారని బ్రిటన్ గూఢచార సంస్థ తెలిపింది. 2022లో రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇంతటి భారీ నష్టం జరిగిందని GCHQ డైరెక్టర్ ఆన్ కీస్ట్-బట్లర్ పేర్కొన్నారు. కేవలం సరిహద్దుల్లోనే కాకుండా.. పాశ్చాత్య దేశాలను దెబ్బతీయడానికి రష్యా హైబ్రిడ్ యుద్ధాన్ని సాగిస్తోందని ఆన్ కీస్ట్-బట్లర్ హెచ్చరించారు. అంటే రష్యా సైనిక దాడులతో పాటు సైబర్ దాడులు, గూఢచర్య కార్యకలాపాలు, ఇతర దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే పనులు చేస్తోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా బ్రిటన్, నాటో దేశాల మౌలిక వసతులు, ఇంటర్నెట్ వ్యవస్థలు, ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడానికి రష్యా ప్రయత్నిస్తోందన్నారు.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
⚡ BREAKING: 🇷🇺Nearly 500,000 Russian soldiers have been killed since the Ukraine war began, the UK spy chief has revealed pic.twitter.com/RNca5gGUoI
— Niranjan Ghatule (@NiranjanGhatule) May 27, 2026
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
కేవలం అంచనా మాత్రమే..
సాధారణంగా ఏ దేశం కూడా తమ సైనికులు ఎంతమంది యుద్ధంలో చనిపోయారనే విషయాన్ని బయటపెట్టదు. అలాగే ఈ 5 లక్షలు కూడా ఒక అంచనా మాత్రమే. అయితే ఇప్పటివరకు సుమారు 2.23 లక్షల మరణాలను మాత్రమే ఆధారాలతో ధృవీకరించగలిగినట్లు తెలుస్తోంది. నిజానికి దీని కంటే ఇంకా ఎక్కువ మందే చనిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఉక్రెయిన్‌లో సుమారు 55 వేల మంది సైనికులు మరణించారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
Anne Keast-Butler, head of Britain's signals intelligence agency Government Communications Headquarters, said nearly 500,000 Russian soldiers have been killed in Ukraine since February 2022. She delivered the figure at Bletchley Park Wednesday — the first time UK intelligence has… pic.twitter.com/fM030hoxjc
— IredcapI (@IredcapI) May 27, 2026
Follow Us