Russia: ఉక్రెయిన్ దూకుడు.. రష్యా పైకి క్షిపణుల వర్షం

ఇటీవల అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ క్షిపణలు వాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి ఆరు క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడులను తిప్పికొట్టామని రష్యా ప్రకటించింది.

New Update
missl

రెండేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఏం జరుగుతుందో అని తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలతో కాలం వెల్లదీస్తున్నారు.  ఇటీవల ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌లపై రష్యా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ క్షిపణలు వాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి ఆ క్షిపణులను ప్రయోగించింది.  

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Russia - Ukraine War

ఈ విషయాన్ని రష్యా రక్షణమంత్రిత్వ శాఖ తాజాగా ధృవీకరించింది. అమెరికా తయారు చేసిన ఏటీఏసీఎంఎస్‌ (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్) క్షిపణులను ఉక్రెయిన్ మొదటిసారిగా తమ దేశంపై ప్రయోగించిందని చెప్పింది. ఆరు క్షిపణులను బ్రయాన్స్క్‌ ప్రాంతంపై ప్రయోగించిందని పేర్కొంది. తమ దేశం అందిస్తున్న మిసైల్స్‌ను రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇస్తున్నామని బైడెన్‌ ప్రకటించిన రోజల వ్యవధిలోనే ఈ దాడి చోటుచేసుకుంది. 

Also Read: CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

అయితే తమ దేశంపైకి దూసుకొచ్చిన మిసైల్స్‌లో ఐదింటిని కూల్చేశామని.. మరోదాన్ని కూడా నాశనం చేసినట్లు చెప్పింది. క్షిపణి శకలాలు కిందపడటంతో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయని తెలిపింది. అలాగే ఎలాంటి ప్రాణనష్టం కూడా జరగలేదని పేర్కొంది. ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ఉత్తర కొరియా సాయం తీసుకుంటోంది. ఇటీవలే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ మిసైల్స్‌ను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు ఆయన పర్మిషన్ ఇచ్చారు.  

Also Read: త్వరలో భారత్‌కు రష్యా అధ్యక్షుడు

ఉక్రెయిన్‌ చేసిన ఈ దాడిపై రష్యా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేదానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయే అనేదానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధం కూడా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధాలు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read :  ఆసియా ఛాంపియన్స్‌లో ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళిన భారత మహిళల హాకీ జట్టు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment