US- PAK Deal : పాక్ బ్రోకరేజ్ కు ప్రతిఫలం.. భారత్ కు షాక్ ఇస్తూ ట్రంప్ షాకింగ్ నిర్ణయం!

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది. సుమారు 488 మిలియన్ డాలర్ల విలువైన F-16 రడార్ సపోర్ట్ కాంట్రాక్ట్‌లో పాకిస్థాన్‌ను భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
FotoJet - 2026-05-03T104712.163

US- PAK Deal

 US- PAK Deal : అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దక్షిణ ఆసియా రక్షణ సమీకరణాలపై ప్రభావం చూపించేవిధంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది. సుమారు 488 మిలియన్ డాలర్ల (సుమారు ₹4,000 కోట్లు) విలువైన F-16 రడార్ సపోర్ట్ కాంట్రాక్ట్‌లో పాకిస్థాన్‌ను భాగస్వామిని చేస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.

యూఎస్ ఎయిర్‌ఫోర్స్, ప్రముఖ రక్షణ సంస్థ 'నార్త్‌రోప్ గ్రుమ్మన్'తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పాకిస్థాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాల్లోని APG-66, APG-68 వంటి అడ్వాన్స్‌డ్ రడార్ సిస్టమ్‌లకు సాంకేతిక, ఇంజనీరింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ సేవలు 2036 వరకు అమలులో ఉంటాయి. గతంలో అంటే డిసెంబర్ 2025లో కూడా పాకిస్థాన్ F-16 విమానాల అప్‌గ్రేడ్ కోసం అమెరికా 686 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో లింక్-16 సిస్టమ్, ఏవియానిక్స్ అప్‌గ్రేడ్స్,శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి.

ఇరాన్,అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త సమయాల్లో పాకిస్థాన్ కేవలం ఒక సందేశకర్తగా కాకుండా, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ 'మధ్యవర్తిత్వం' లేదా దౌత్యపరమైన సహకారానికి ప్రతిఫలంగానే అమెరికా పాకిస్థాన్ రక్షణ సామర్థ్యాన్ని పటిష్టం చేస్తోందని భావిస్తున్నారు. తన మిత్రదేశాల సైనిక సామర్థ్యాన్ని కాపాడటం తన జాతీయ భద్రతా ప్రయోజనమని అమెరికా చెబుతున్నప్పటికీ, దక్షిణాసియాలో తన పట్టును కోల్పోకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం.

పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఈ రక్షణ సహకారంపై భారత్ ఎప్పటి నుంచో తన నిరసనను వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరు కోసం అని అమెరికా చెబుతున్నప్పటికీ, ఈ F-16 విమానాలను పాకిస్థాన్ భారత్‌పై దాడి చేసేందుకే వాడుతోందని (2019లో బాలాకోట్ దాడుల సమయంలో జరిగినట్లుగా) భారత్ స్పష్టం చేస్తోంది.అయితే, ఈ అప్‌గ్రేడ్ ప్యాకేజీ వల్ల భారత వాయుసేనకున్న ఆధిక్యం కోల్పోతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్ వద్ద ఉన్న F-16లు పాత తరం విమానాలు. అమెరికా ఇస్తున్నది కేవలం వాటిని పని చేసే స్థితిలో ఉంచేందుకు, కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచే సపోర్ట్ మాత్రమే. భారత వాయుసేనలో ఉన్న రాఫెల్ (Rafale) యుద్ధ విమానాలు 4.5 జనరేషన్ సాంకేతికతతో కూడినవి. ఇవి పాకిస్థాన్ అప్‌గ్రేడెడ్ F-16ల కంటే ఎంతో శక్తివంతమైనవి మాత్రమే కాకుండా అత్యాధునికమైనవి కూడా.

ఈ ఒప్పందం పాకిస్థాన్ వాయుసేన మనుగడకు ప్రాణం పోసినట్లు అయినప్పటికీ, భారత రక్షణ సామర్థ్యాన్ని సవాలు చేసేంత 'గేమ్ ఛేంజర్' మాత్రం కాదని రక్షణ నిపుణుల అభిప్రాయం. అయినప్పటికీ, పాకిస్థాన్‌కు అమెరికా అండగా నిలవడం భారత్, అఫ్గానిస్తాన్ , ఇరాన్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు