/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t11513-2026-02-04-11-53-15.jpg)
Monks arrested in Thailand
Monks arrested in Thailand : థాయిలాండ్‌లో ఓ బౌద్దసన్యాసుల మఠంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఇతర నిషేదిత వస్తువులు లభించాయి. దీంతో ఆ నలుగురు సన్యాసులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోన్‌బూరి ప్రావిన్స్‌లోని ఫ్రోమ్ సాంథోన్ అనే బౌద్ద సన్యాసుల ఆశ్రమంలో నిషేదిత వస్తువులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఆశ్రమంపై దాడి చేయగా పలు నిషేదిత వస్తువులు లభించాయి. తనీఖీల్లో తుపాకులు, మాదకద్రవ్యాలు, అశ్లీల చిత్రాల వీడియోలు లభించాయి. అదొక్కటే కాకుండా వారి వద్ద అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళల ఫోన్ నెంబర్లను గుర్తించినట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం.
అరెస్టయిన వారిలో ఫ్రా సుపాచాయ్, జంతావోంగ్, ఫ్రా విరాట్ ముక్దాసానిత్, ఫ్రా థానావోల్ తదితరులున్నారు. వీరందరూ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆశ్రమంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడుతున్న ముగ్గురు సన్యాసులను పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. మరోకరిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలోనూ ఆరోపణలు
2025లో థాయ్‌లాండ్‌లో సెక్స్ స్కాండల్స్, అవినీతి మరియు డ్రగ్స్ వాడకం వంటి తీవ్రమైన ఆరోపణలతో పలువురు సీనియర్ బౌద్ధ సన్యాసులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళ సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు బయటపడటంతో ఈ ఘటన సంచలనమైంది, అలాగే మఠాధిపతులు టెంపుల్ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనల వల్ల థాయ్ సమాజంలో సన్యాసుల వ్యవస్థ పట్ల నమ్మకం సడలింది.
ఒక మహిళ బౌద్ధ సన్యాసులను లైంగిక ప్రలోభాలకు గురిచేసి, వారిపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ కుంభకోణంలో పాల్గొన్న తొమ్మిది మందికి పైగా మఠాధిపతులు, సీనియర్ సన్యాసులు సన్యాసం నుండి తొలగించబడ్డారు. నలుగురు సన్యాసులు డ్రగ్స్ (మెథాంఫేటమిన్) వాడినట్లు పాజిటివ్‌గా తేలడంతో వారిని అరెస్టు చేసి పునరావాసానికి పంపారు. మరో సీనియర్ సన్యాసి, ఆలయ విరాళాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం దుర్వినియోగం చేసినందుకు అరెస్టయ్యారు.ఈ పరిణామాలతో సన్యాసులపై నిఘా పెంచారు. సన్యాసుల ప్రవర్తన సరిగ్గా లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ అరెస్టుల తర్వాత, ప్రజలు ఆలయాలకు ఇచ్చే విరాళాల విషయంలో పునరాలోచనలో పడ్డారు.
Follow Us