Trump Vs Pope: అగ్రరాజ్యంపై పోప్ లియో XIV తిరుగుబాటు!

యుద్ధంపై పోప్ లియో XIV సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ భయపడనని, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

New Update
_pope

Trump Vs Pope: ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న యుద్ధ మేఘాలపై పోప్ లియో XIV సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ భయపడనని, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

దేవుడి పేరుతో యుద్ధాలా? - పోప్ సూటి ప్రశ్న

యుద్ధం వల్ల వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది అత్యంత విచారకరమని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. "దేవుడి సందేశాలను మీ రాజకీయ ప్రయోజనాల కోసం, యుద్ధాల కోసం దుర్వినియోగం చేయకండి" అంటూ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా, శాంతి కోసం తాను నిరంతరం గళం విప్పుతూనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

పోప్ వ్యాఖ్యలపై డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా పోప్‌పై విమర్శల వర్షం కురిపించారు. అమెరికా విదేశాంగ విధానంపై వ్యాఖ్యలు చేసే అధికారం పోప్‌కు లేదని ఆయన మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్‌ను విమర్శించే పోప్ అవసరం తమకు లేదని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను భారీ మెజారిటీతో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన అధ్యక్షుడినని, తన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి

పోప్ ఎంపికపై వివాదాస్పద వ్యాఖ్యలు

కేవలం యుద్ధంపైనే కాకుండా, పోప్ లియో XIV ఎన్నికపై కూడా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోప్ పదవి కోసం అనుకున్న అభ్యర్థుల జాబితాలో అసలు లియో పేరే లేదని, ఆయన ఎంపిక ఒక "షాకింగ్ సర్‌ప్రైజ్" అని ట్రంప్ ఎద్దేవా చేశారు. పోప్ పదవి దక్కించుకున్నందుకు ఆయన కృతజ్ఞతతో ఉండాలి తప్ప, తనను విమర్శించడం సరికాదని హితవు పలికారు. శాంతిని కాపాడాలని పోప్ కోరుతుంటే, దేశ భద్రత, విదేశాంగ విధానంలో రాజీ పడబోమని ట్రంప్ అంటున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ 'కోల్డ్ వార్' అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు