బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..

అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.

New Update
PM mOdi

BRICS Summit 2024: రష్యాలో అక్టోబర్ 22, 23న రెండు రోజుల పాటు 16వ బ్రిక్స్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరిన ప్రధాని మోదీ తాజాగా అక్కడికి చేరుకున్నారు. ఈ పర్యటనలో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. 16వ బ్రిక్స్ సదస్సు అనేది.. సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి - భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం అనే అంశంపై జరగనుంది. 

Also Read: లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు..

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ !

అయితే ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఇతర బ్రిక్స్ నేతలతో కూడా ఆయన ద్వైపాక్షిక చర్టలు జరిపే ఛాన్స్ ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. 22న ఈ సమ్మిట్ ప్రారంభం అవుతుంది. తొలిరోజు సాయంత్రం దేశాధినేతలకు విందు ఉంటుంది. ఇక 23న ఉదయం క్లోజ్జ్‌ ప్లీనరీ, మధ్యాహ్నం ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుంది. 

Also Read: వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత

సరిహద్దు వివాదానికి పరిష్కారం దిశగా

బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్, చైనాల మధ్య ఓ కొత్త ఒప్పందం కుదిరింది. 2020 నుంచి భారత్, చైనా సరిహద్దు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేలా ముందడుగుడు పడింది. ఇరుదేశాల మధ్య సైనిక, దౌత్యస్థాయిలో కసరత్తుల అనంతరం వాస్తవ నియంత్రణ రేఖ (LAC)పై పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతను తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది. బ్రిక్స్‌ గ్రూప్‌లో 2010 నుంచి బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాజాగా ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఈజిప్ట్ దేశాలు కూడా ఇందులో చేరాయి.  

Also Read: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు

ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ హాజరయ్యారు. ఈ పర్యటన సందర్భంగా అప్పుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత  పౌరపురస్కారం అయిన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌' ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ బ్రిగ్స్ సదస్సులో ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు