/rtv/media/media_files/2026/03/28/tomahawk-cruise-missiles-2026-03-28-12-58-06.jpg)
Tomahawk cruise missiles
Tomahawk cruise missiles : ఇరాన్ తో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా దాన్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో యుద్ధం మొదలు పెట్టిన గడచిన నెలరోజుల్లో అమెరికా 850 తోమహాక్ క్రూజ్ క్షిపణులను ఇరాన్ పై ప్రయోగించింది. ఒక దేశంతో యుద్ధం కోసం ఇంత పెద్ద మొత్తంలో క్షిపణులను ఉపయోగించడం రక్షణవర్గాలను కలవరానికి గురిచేస్తోంది. సగటున పెంటాగాన్ ఒక ఏడాదిలో కొనుగోలు చేసే వాటికంటే ఆ సంఖ్య తొమ్మిది రెట్లు ఎక్కువని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గణాంకాలు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా ఏడాదికి కేవలం 90 తోమహాక్ క్షిపణులను కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ఏడాది యూఎస్ నేవీ నుంచి కేవలం57 మిస్సైళ్లకే రిక్వెస్ట్ వచ్చినట్లు యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌పత్రాల ద్వారా వెల్లడైంది. అయితే ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెద్ద మెత్తంలో వీటిని వినియోగించడం మూలంగా అమెరికా వద్ద క్షిపణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ చెందిన అధికారులు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. అలాంటి సమస్య ఏదీ లేదంటున్నారు. ‘‘యుద్ధ లక్ష్యాలను పూర్తి చేసేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి అమెరికా వద్ద ఉంది. అమెరికా అభివృద్ధి చేసిన ఆయుధాల ఉత్పత్తి వేగవంతం చేసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు’’ అంటూ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వివరించారు. ఆయుధాల కొరత ఉందనేది ఆవాస్తవం అంటూ పేర్కొన్నారు.
తోమహాక్ ల గురించి..
సుదూర లేక అత్యంత పటిష్ఠమైన లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా ఈ తోమహాక్ క్షిపణులను యుద్ధంలోకి దింపుతుంది. అయితే ఇరాన్‌తో యుద్ధం మూలంగా వీటిని విరివిగా వాడుతోంది. సుమారు 850 వరకు ఇప్పటికే వినియోగించినిట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్షిపణులు భారీగా తరగిపోయాయని ప్రచారం సాగుతోంది. ఇరాన్ చిన్న రాయిని అమెరికా పైకి విసిరితే అమెరికా మాత్రం చిన్న చిన్నలక్ష్యాలను పూర్తి చేయడానికి కూడా తోమహాక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో ఆయుధ సంపత్తి గణనీయంగా తగ్గిపోతుందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్షిపణులను ఎక్కువగా విధ్వంసక నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించడం చేస్తుంటారు. ఇవి సుమారు 1000 మైళ్లకు (1609 కి.మీ.) పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలవు. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలను కూడా దాటుకొని ఇవి దాడి చేసే అవకాశం ఉంది. ఆర్మీ కూడా వీటిని వినియోగిస్తోంది. బ్రిటన్ నేవీ సహా యూఎస్ మిత్రదేశాల వద్ద ఈ క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రతి ఏడాది తయారు చేస్తున్న తోమహాక్ క్షిపణుల సంఖ్య అమెరికాలో సుమారు 3.100 వరకు ఉండవచ్చని అంచనా. అయితే ఇరాన్ యుద్ధం మూలంగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక వాటి ధర వెర్షన్, లాంచ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మారుతుంది. సాధారణ ప్రామాణిక వేరియంట్ ధర 2.2 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్ల వరకు) ఉండొచ్చని యూఎస్ అధికారులు అంటున్నారు. నౌకల వంటి మూవింగ్ టార్గెట్లను ఢీకొట్టేందుకు వాడే వెర్షన్ల ధర 4 మిలియన్ల వరకు ఉంటాయని ఆ దేశ రక్షణరంగ నిపుణులు వెల్లడించారు. ఇవే కాక మరికొన్ని 6 మిలియన్ల వరకు ఉంటాయి. ఇవి ఇంకా సుదూర లక్ష్యాలను టార్గెట్ చేసినప్పటికీ.. వీటి ఖర్చు ఎక్కువ. తయారీ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది.. అయితే అమెరికా ప్రస్తుతం కొత్త క్షిపణులు సమకూర్చుకొనే క్రమంతో పోలిస్తే వీటి వినియోగం భారీ స్థాయిలో ఉండటంతో దేశంలో ఆయుధాల సంఖ్య తగ్గుతోంది.
‘‘కాగా ఇప్పటికే వేలాదిగా తోమహాక్ క్షిపణులతో పాటు కచ్చితత్వంతో టార్గెట్ చేసే ఇతర క్షిపణులు, సుదీర్ఘ శ్రేణి ఆయుధాలను అమెరికా ఇరాన్‌పై ప్రయోగిస్తోంది.. అలాగే పేట్రియాట్, థాడ్‌తో పాటు పలు గగతనతల రక్షణ వ్యవస్థలను అక్కడ మోహరిస్తున్నారు. అయితే ఇది ఆందోళన కలిగించే అంశమని’’ అని డెమోక్రటిక్ సెనెటర్ జాక్ రీడ్ ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. దేశంలో గరిష్ఠస్థాయిలో ఏడాదికి 2,330 క్షిపణులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే పెంటగాన్ మాత్రం ప్రతి ఏటా 90 క్షిపణులను మాత్రమే కొనుగోలు చేస్తోంది. అయితే అత్యంత నాణ్యమైన ఆయుధాల తయారీకి పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఆయుధ సంస్థలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వెల్లడించారు.భవిష్యత్తులో ఎవరూ ఊహించనివిధంగా ఆయుధాలను రీఫిల్ చేస్తామని వెల్లడించారు.
Follow Us