పాకిస్థాన్ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్‌ను క్రూరంగా చంపేశారు..! జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఆదివారం రెచ్చిపోయారు. ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులను హతమార్చారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని తెలుస్తోంది. By Seetha Ram 21 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి జమ్మూకశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం ఏడుగురిని హతమార్చారు. అందులో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌లోని షేర్-ఎ- కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)లో అడ్మిట్ చేశారు. ఆ కార్మికులు భోజనానికి కూర్చున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకొని వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులతో పాటు రెండు వాహనాలు సైతం దగ్దమయ్యాయి. ప్రధాన సూత్రధారి అతడేే? ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించిందని తెలుస్తోంది. ముఖ్యంగా TRF చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని.. అతని ఆదేశాల మేరకే మొదటిసారిగా కశ్మీరీలు, కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా కాశ్మీర్‌లో TRF చాలా చురుకుగా ఉంది. Also Read: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి టైటిల్ సొంతం ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ గత ఒకటిన్నర సంవత్సరాలలో కాశ్మీరీ పండిట్‌లు, సిక్కులు, స్థానికేతరులను ఇది లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగానే చాలా మంది కాశ్మీరీ పండిట్‌లను హతమార్చింది. ఇక ఇప్పుడు కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని టిఆర్ఎఫ్ కాల్పులు జరిపినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఇలాంటి ఘటన జరగడంపై ఆయన స్పందించారు. నిరాయుధ అమాయక ప్రజలపై దాడిని తీవ్రంగా ఖండించారు. Also Read: మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు..? కారణం ఇదేనా సొరంగ నిర్మాణ పనులు జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ - లేహ్ నేషనల్ హైవేలో సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సొరంగం లడఖ్‌లోని ప్రజలకు, భారత సైన్యానికి అన్ని విధాల కనెక్టివిటీని అందిస్తుంది. అయితే ఈ నిర్మాణ పనులు చేపట్టిన ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికుల కోసం కొన్ని గుడిసెలు ఏర్పాటు చేసింది. ప్రతి రోజూలాగానే కార్మికులు అక్కడి పని పూర్తయిన తర్వాత తమ గుడెసెకి చేరుకున్నారు. Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి ఏడుగురు మృతి అనంతరం భోజనం చేసేందుకు అంతా ఒక్కచోట కూర్చున్నారు. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు ఆ గుడెసె దగ్గరకు చేరుకుని కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో డాక్టర్ షానవాజ్, గుర్మీత్ సింగ్, శశి అబ్రోల్, ఫహీమ్ నజీర్, మహ్మద్ హనీఫ్, కలీమ్, అనిల్ కుమార్ శుక్లా మృతి చెందారు. Also Read: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే? అలాగే ఇందర్ యాదవ్, మోహన్ లాల్, ముస్తాక్ అహ్మద్, ఇష్పాక్ అహ్మద్ భట్, జగ్తార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దారుణం జరిగిన వెంటనే పోలీసు బలగాలు, సైనిక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ పరిస్థితిని పరిశీలించన తర్వాత ఉగ్రవాదులను పట్టునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. #crime #jammu-and-kashmir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి