/rtv/media/media_files/2026/05/25/ukraine-russia-2026-05-25-06-30-01.jpg)
Ukraine-Russia
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో రష్యా తన అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి దాడులు చేసింది. రష్యా కేవలం ఒక క్షిపణితో ఆగకుండా ఒకసారి 90 క్షిపణులు, సుమారు 600 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఈ భారీ దాడి వల్ల కీవ్ ప్రాంతంలోని బిలా జెర్‌క్వా నగరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధృవీకరించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఎన్నో భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
🇷🇺🇺🇦 Russia hit Ukraine with one of its biggest strikes in years overnight
— The Other Side Media (@TheOtherSideRu) May 24, 2026
Around 700 drones and 100 missiles, including Oreshniks, were fired at Kiev alone
The attack comes in response to the Lugansk dormitory strike that killed 21 people between the ages of 17 and 22 https://t.co/mZ3vS7lGhkpic.twitter.com/3HoqGBiwTO
ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
ప్రమాదకరమైన ఆయుధం..
ఒరెష్నిక్ అనేది రష్యా అమ్ములపొదిలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఇది శబ్దానికి కొన్ని రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా ఈ క్షిపణిని వాడటం ఇది కేవలం మూడోసారి మాత్రమే. గతంలో నవంబరు 2024లో నీప్రోపై.. ఈ ఏడాది జనవరిలో లవీవ్‌పై దీనిని ప్రయోగించారు.మళ్లీ ఇప్పుడు రష్యా ప్రయోగించింది.
ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!
🚨 Breaking: Russia unleashes one of its heaviest strikes on Kyiv yet — 600 drones + 90 missiles, including the nuclear-capable Oreshnik hypersonic.
— Be Honest (@Be_honest07) May 25, 2026
4 dead, over 80 wounded in the Ukrainian capital.
This is very Big. #RussiaUkraineWarhttps://t.co/DJJrn3rdukpic.twitter.com/iEZoUbk63X
ఇది కూడా చూడండి: Gwalior : ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ పాలక్ డెత్ మిస్టరీ!
Follow Us