China:మమ్మల్ని ఎవరూ ఆపలేరు..తైవాన్‌కు చైనా వార్నింగ్

న్యూఇయర్ సందర్భంగా తైవాన్‌కు చైనా అధ్యక్షడు జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌తో తమ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయాన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

New Update
XI jin ping

మొత్తం ప్రపంచం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతోంది. చైనా కూడా ఈ వేడుకల్లో భాగం అయింది.  ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ న్యూ ఇయర్ సందర్భంగా సందేశాన్ని ఇచ్చారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.  తైవాన్‌ చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని జిన్ పింగ్ అన్నారు.ఆ దేశంలో ఐనాలో అంతర్భాగమని ఆయన అన్నారు.    గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్యా ఈ విషయమై గొడవ నడుస్తోంది. చాలాసార్లు చైనా తైవాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది.  ఈ నేపథ్యంలో జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తైవాన్‌ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు కూడా ఆయన చెప్పారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు మరియు మాతృభూమి పునరేకీకరణ యొక్క చారిత్రక ధోరణిని ఎవరూ ఆపలేరు అని జిన్ పింగ్ తన ప్రసంంలో చెప్పారు. 

చైనా, తైవాన్ వేరు కాదని ఈ రెండు దేశాలు కూడా ఒకే జీనవ విధానాన్ని సూచిస్తాయని పలు సందర్భాల్లో చైనా చెప్పింది.  వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చెబుతూ వస్తోంది. మే నెలలో తైవాన్ ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  చైనా మూడు సార్లు తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులు నిర్వహించింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలాసార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది. 

 

Also Read: HYDRA: అలా ఎలా చేస్తారు..హైడ్రీ తీరుపై హైకోర్టు ఆగ్రహం

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు