ట్రంప్‌ను చంపే ప్లాన్‌పై అమెరికాకు ఇరాన్‌ మెసేజ్‌

ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో అమెరికా హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. తమకు ట్రంప్‌ను చంపే ఉద్దేశం లేదని ఇటీవలే అమెరికాకు సందేశం పంపినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది.

New Update
khh

అమెరికాలోని పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో గతంలో అమెరికా హెచ్చరించింది. అయితే ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేప్పింది. బైడెన్ ప్రభుత్వానికి సందేశం పంపినట్లుగా న్యూయార్క్ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచూరించింది.  

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ చెక్ చేసిన అధికారులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై రెండుసార్లు హత్యయత్నం జరిగింది. దీనిపై ఆయన ప్రచార ఓ బృందం ప్రకటన విడుదల చేసింది.  అమెరికాలో గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అలగే ట్రంప్‌నకు కచ్చితమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించిందని పేర్కొంది. మరోవైపు ట్రంప్ హయాంలో 2020లో జరిగిన ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ కుట్రకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం టెహ్రాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. 

Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?

ఈ నేపథ్యంలోనే ఇరాన్ స్పందిస్తూ అక్టోబర్‌లో తమ వివరణ పంపించిందని తాజా కథనం పేర్కొంది. '' సులేమానీ హత్య నేరపూరిత చర్య. దీనిపై మేము అంతర్జాతీయ న్యాయ మార్గాల్లో పోరాడుతాం. హింసాత్మక ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు. ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం మాకు లేదని'' ఇరాన్ తమ సందేశంలో చెప్పినట్లు'' న్యూయార్క్‌ టైమ్స్ వెల్లడించింది. టెహ్రాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ నుంచే ఈ సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత

Also Read: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

 

Advertisment
Advertisment
తాజా కథనాలు