/rtv/media/media_files/2026/02/05/nigeria-2026-02-05-13-36-22.jpg)
Nigeria
నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను చుట్టుముట్టారు. దుండగులు గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు.ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం హత్యలు చేయడమే కాకుండా గ్రామాల్లోని ఇళ్లను, దుకాణాలకు నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రాణభయంతో కొందరు ప్రజలు అడవుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లో ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.
ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు.. ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!
Bro Nigeria 🇳🇬 is gone💔 our leaders has finished the country 💔 over 200 abi close to 200 people k*lled like chickens and everywhere is silent like it’s normal💔 everyone should be flooding the streets right now asking all this leaders to leave power pic.twitter.com/cf51qvsz3H
— Softy (@Softychels) February 5, 2026
ప్రతీకార దాడి..
గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపుతున్నా, ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్‌లో సుమారు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారిని చంపినందుకు ప్రతీకారంగానే సాయుధ ముఠాలు ఈ నరమేధానికి పాల్పడి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అలాగే కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు రెచ్చిపోయారు. అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Amnesty International has condemned the killing of more than 200 people in separate incidents, which occurred on Tuesday, February 3, in Kwara and Katsina States. pic.twitter.com/lRCnyLNTDq
— Onyebuchi Onyibest (@OnyebuchiO45673) February 5, 2026
Follow Us