US GREEN CARD POLICY : గ్రీన్‌కార్డు కొత్త రూల్స్‌.. ఆ దరఖాస్తుదారులకు ఉపశమనం

అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. యూఎస్ గ్రీన్ కార్డ్ పాలసీలో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) భారీ మార్పులు తెచ్చింది.

New Update
US green card applicants will now have to return to their home countries to apply

New green card rules... relief for those applicants

US GREEN CARD POLICY : అమెరికాలో స్థిరపడాలని కలలు కనే లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. యూఎస్ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హక్కు) పాలసీలో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) భారీ మార్పులు తీసుకువచ్చాయి. అగ్రరాజ్యంలో తాత్కాలిక వీసాల లూప్‌హోల్స్ (చట్టపరమైన లోపాలు) ఉపయోగించుకుంటూ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త పాలసీ ప్రభావం అమెరికాలో దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయులపై తీవ్రంగా పడనుంది.

కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటూ నేరుగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం (అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్) కుదరదు. హెచ్-1బి (H-1B), స్టూడెంట్ (F-1), లేదా టూరిస్ట్ వీసాల వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం ఖచ్చితంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న అమెరికా రాయబార కార్యాలయం (ఎంబసీ) లేదా కాన్సులేట్ ద్వారా మాత్రమే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులో దాదాపు 12 లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్ ఉండగా, అందులో 70 నుంచి 80 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయంతో H-1B వీసాలపై ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులైన H-4 వీసా హోల్డర్ల భవిష్యత్తు ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారింది.

అయితే, ఈ కఠినమైన నిబంధనలు అమెరికాలో ఉన్న తాత్కాలిక వలసదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నేపథ్యంలో, యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ నిబంధనలను పాక్షికంగా సడలిస్తూ కీలక ఉపశమనం కల్పించారు. ఈ నిబంధనలు అందరికీ వర్తించవని, దరఖాస్తుదారుల ప్రొఫైల్‌ను బట్టి కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ (USCIS) ప్రతినిధి జాక్ కహ్లర్ వెల్లడించారు. అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత కీలకమైన వలసదారులకు (National Interest Waivers వంటి కేటగిరీలు) ఈ కఠిన రూల్స్ నుండి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గ్రీన్ కార్డ్ ఆశావహులు సమర్పించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, వారి నైపుణ్యాలు అమెరికా దేశ ప్రయోజనాలకు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయని భావిస్తే వారిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాంటి వారు ప్రస్తుత నిబంధనల ప్రకారమే అమెరికాలో ఉంటూ తమ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతిస్తారు. ఈ ప్రత్యేక అర్హత లేని మిగిలిన సాధారణ దరఖాస్తుదారులందరూ ఖచ్చితంగా తమ స్వదేశానికి వెళ్లి కాన్సులర్ ప్రాసెస్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అమెరికా భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు