Iran : డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచానికే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో ఇరాన్ తన పంథాను మార్చుకుంది. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామంది.

New Update
trump and khameni

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచానికే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో ఇరాన్ తన పంథాను మార్చుకుంది. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై ఈ సముద్ర మార్గంలో తమ మాటే చెల్లుతుందని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు.

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సాధారణంగా ఈ జలసంధి గుండా వందలాది ఓడలు వెళ్తుంటాయి. కానీ, ఇప్పుడు ఇరాన్ పెట్టిన నిబంధనల ప్రకారం, రోజుకు కేవలం 15 ఓడలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. అది కూడా ఇరాన్ సైన్యం అనుమతి ఉంటేనే ఓడలు ముందుకు కదలాలి. పాత రోజులు పోయాయి, ఇకపై అంతా మా పద్ధతిలోనే జరుగుతుందని ఇరాన్ తేల్చి చెప్పింది.

ప్రతి పైసా నష్టపరిహారం

తమ దేశంపై జరిగిన దాడులకు, ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రతి పైసా నష్టపరిహారం వసూలు చేస్తామని ఖమేనీ హెచ్చరించారు. మాకు యుద్ధం ఇష్టం లేదు, కానీ మా హక్కులను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ పెట్టిన ఆంక్షల వల్ల చమురు సరఫరా ఆగిపోయి, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, లెబనాన్‌లో జరుగుతున్న గొడవల వల్ల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో అని అంతా భయాందోళనలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు