G7 Summit: ట్రంప్‌తో మోదీ చిట్ చాట్.. నేవీల డెడ్ నుంచి ట్రేడ్ డీల్ దాకా.. జీ7లో ఏం చర్చించారంటే?

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మోదీని చూసిన వెంటనే లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తూ కాసేపు మాట్లాడారు. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించారు. 

New Update
modi

G7

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మోదీని చూసిన వెంటనే లేచి నిలబడ్డారు. షేక్ హ్యాండ్ ఇస్తూ కాసేపు మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఇరు దేశాల మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించారు. 

ప్రధాని మోదీ ఈ సదస్సులో నేవీ ఉద్యోగుల మృతి గురించి చర్చించారు. ఇటీవల ఒమన్ గల్ఫ్‌లో అమెరికా సైనిక దళాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నావికులు ఎలాంటి భయం లేకుండా ఉండేందుకు రక్షణ కల్పించాలని కోరారు. 

ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఈ సమావేశంతో తుది దశకు చేరుకోనుంది. గత ఫిబ్రవరిలోనే ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రాగా.. నేటి సమావేశం ప్రత్యేకంగా ఈ డీల్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి సారిస్తుందని వైట్ హౌస్ అధికారికంగా తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఖరారు కానుంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన నౌకా రవాణా మార్గాలలో ఒకటైన 'హోర్ముజ్ జలసంధి'లో నెలకొన్న అస్థిరతపై ఇరు నేతలు ప్రధానంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం వాటా ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే వెళుతుంది. ఇక్కడ జరుగుతున్న గొడవల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై మోదీ మాట్లాడారు. 

ఇది కూడా చూడండి: Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

మధ్యప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా ఇబ్బంది అవుతోంది. ఈ ఒడిదొడుకులను తట్టుకుని భారత్‌కు నిరంతరాయంగా ఎనర్జీ అందేలా.. అమెరికా నుండి ఇంధన దిగుమతులను మరింత విస్తరించడంపై చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఒక పటిష్టమైన, దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని నెలకొల్పేలా ఇరు నేతలు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు