/rtv/media/media_files/2026/05/20/modi-2026-05-20-16-57-26.jpg)
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చివరి స్టాప్‌గా ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎంతో సాదరంగా, ఆత్మీయంగా ఆతిథ్యం ఇచ్చారు. ఇద్దరు నేతలు కలిసి రాత్రి డిన్నర్ చేయడమే కాకుండా, అక్కడి ప్రసిద్ధ చారిత్రక కట్టడం కొలోసియంను కూడా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యాపారం, రక్షణ, సాంకేతిక రంగాలలో బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.
అయితే ఈ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇటలీ వెళ్తూ తనతో పాటు స్పెషల్‌గా ఒక ప్యాకెట్ పార్లే మెలోడీ చాక్లెట్లను తీసుకెళ్లారు మోదీ. వాటిని మెలోనీకి గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. థాంక్యూ ఫర్ ద గిఫ్ట్ అంటూ ఇటలీ ప్రధాని మెలోనీ ఈ చాక్లెట్ల వీడియోను తన సోషల్ మీడియాఖాతాలో షేర్ చేశారు. వీడియోలో ఆమె ఆ చాక్లెట్ ప్యాకెట్ చూపిస్తూ.. "మోడీ మాకోసం చాలా చాలా మంచి చాక్లెట్లు తెచ్చారు.. అవే మెలోడీ!" అంటూ నవ్వుతూ చెప్పారు.
మిలియన్ల వ్యూస్‌తో తెగ వైరల్
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్‌తో తెగ వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు సరికొత్త మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ఈ దెబ్బతో గూగుల్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా "పార్లే షేర్ ప్రైస్ ఎంత? మెలోడీ చాక్లెట్ ధర ఎంత? అంటూ జనాలు విపరీతంగా వెతకడం మొదలుపెట్టారు.
రాజకీయాలు, దేశాల మధ్య చర్చలు అంటే ఎప్పుడూ సీరియస్‌గా సాగుతుంటాయి. కానీ మోడీ చేసిన ఈ చిన్న చాక్లెట్ మ్యాజిక్ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత మధురంగా మార్చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Follow Us