/rtv/media/media_files/2024/11/17/0IdKtiHzcOx6lkCuIqCN.jpg)
ప్రపంచవ్యాప్తంగా జరిగే అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌కు ఉండే క్రేజే వేరు. అయితే తాజాగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. మొత్తం 125 మంది విశ్వ సుందరి కీరిటం కోసం పోటీ పడ్డారు. చివరికి డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార్ ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు.
Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?
విక్టోరియా కెజార్‌కు షెన్నిస్ పలాసియోస్ కిరిటాన్ని అందజేశారు. ''కొత్త శకం ప్రారంభమైంది.''73వ విశ్వ సుందరిగా విజయం సాధించినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్పూర్తి నింపేలా మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలాని ఆశిస్తున్నామని'' మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుంచి రియా సింఘా పాల్గొన్నారు. కానీ ఆమె టాప్ 5లో కూడా నిలవలేకపోయారు.
Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!
ఇక్కడ మరో విషయం ఏంటంటే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విక్టోరియానే కావడం విశేషం. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె.. బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా కూడా మారారు. డ్యాన్సులో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ వంటి వాటిపై కూడా పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి రావాలనే ఉద్దేశంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. మిస్ డెన్మార్క్‌గా కూడా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచారు. ఇక 2024లో ఏకంగా మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకొని ప్రశంసలు అందుకుంటున్నారు.
Also Read: పిచ్చెక్కిస్తున్న పిల్లి సంపాదన.. రూ.800 కోట్లకు పైగా.. ఎలాగంటే?
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్ లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...
Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!