Hormuz : షాకింగ్ ఫ్యాక్ట్ :  సొంతంగా పెట్టిన బాంబులే గుర్తుపట్టని ఇరాన్.. దొరకని లొకేషన్లు!

ఒకవైపు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతున్నాయనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఒక షాకింగ్ నిజం బయటపడింది.

New Update
iran (1)

ఒకవైపు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతున్నాయనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఇరాన్ తన సముద్ర తీర రక్షణ కోసం సముద్ర గర్భంలో బిగించిన మైన్స్ ఇప్పుడు ఆ దేశానికే పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరాన్ తాను ఎక్కడెక్కడ బాంబులు పెట్టిందో ఆ లొకేషన్లను ఇప్పుడు గుర్తు పట్టలేకపోతోందట. దీనివల్ల ఆ మార్గాన్ని పూర్తిగా తెరవడం ఇరాన్ వల్ల కావడం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

ఎక్కడ పడితే అక్కడ బాంబులు

గత నెలలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు, ఇరాన్ తన చిన్న చిన్న పడవల ద్వారా సముద్రంలో భారీగా బాంబులను అమర్చింది. అయితే ఈ ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసుకుంటూ పోయారు. దీనివల్ల ఏ బాంబు ఎక్కడుందో రికార్డులు సరిగ్గా లేవు. దీనికి తోడు సముద్రపు అలల ఉధృతికి కొన్ని బాంబులు తమ ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ బాంబులను వెతికి తీయడం ఇరాన్ దగ్గరున్న సాంకేతికతతో అసాధ్యమని తెలుస్తోంది.  

ఈ సమస్య వల్లే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవలేకపోతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పరోక్షంగా ఒప్పుకున్నారు. కేవలం ఒక చిన్న దారిని మాత్రమే ప్రస్తుతం షిప్పుల రాకపోకల కోసం ఉంచారు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఓడ ఆ దారి తప్పి పక్కకు వెళ్తే, సముద్రంలో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న బాంబు తగిలి పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ బాంబులను తొలగించాలంటే బ్రిటన్ దగ్గరున్న అధునాతన టెక్నాలజీ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ హోర్ముజ్ మార్గం నుంచే వెళ్తుంది. ఈ మార్గంలో ఇన్ని ఇబ్బందులు ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే సరుకు రవాణా చేసే కంపెనీలు కూడా ఈ దారిలో రావడానికి భయపడుతున్నాయి. ఇరాన్ సైన్యం కొన్ని రూట్ మ్యాపులను విడుదల చేసినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో నమ్మదగ్గవిగా లేవని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు