కుప్పకూలుతున్న పాక్, బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.. భారత్ పరిస్థితి ఎలా ఉందంటే ?

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో ముడి చమురు, సహజ వాయువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

New Update
Middle East Conflict Shakes Global Energy Market

Middle East Conflict Shakes Global Energy Market

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో ముడి చమురు, సహజ వాయువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. భారత్‌ కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. చమురు ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.336, డీజిల్ రూ.321కి చేరింది.  

దేశంలో ఇంధన కొరత ఉండటంతో పాక్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తోంది. బంగ్లాదేశ్‌లో కూడా అక్కడి ప్రభుత్వం రేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే వాహనాలకు పరిమితంగా ఇంధనం అందిస్తారు. చమరు ధరల పెరుగుధలతో పాక్, బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. 

Also Read: దేశంలో వంట గ్యాస్‌ కొరత.. అక్కడ హోటల్స్‌ అన్ని క్లోజ్‌

హార్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభన

ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హర్ముజ్ జలసంధి మార్గం నుంచే వస్తుంది. ఇందులో భారత్‌కు దాదాపు 50 శాతం ఈ మార్గం నుంచే చమురు దిగుమతి అవుతుంది. గతంలో ఈ మార్గంలో రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు కేవలం 2,3 నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. దీంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు చేరింది. అయితే ఇరాన్‌తో త్వరలో యుద్ధం ముగుస్తుందని, చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ తాజాగా హామీ ఇచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత చమురు ధర బ్యారెల్‌కు 89 డాలర్ల వద్ద స్థిరపడింది.  

భారత్‌పై ప్రభావం 

భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. పెరిగిన ధరల భారం ప్రజలపై పడకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. గ్యాస్ ధరలపై మాత్రం ప్రభావం కనిపిస్తోంది. ఇండియన్ ఆయిల్ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115కు పెంచింది. ఇంధన సంక్షోభం, LPG సరఫరాలపై ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కేంద్రం LPG ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలకు ఆదేశాలు జారీ చేసింది. 

'ప్లాన్‌ బీ' తో  భారత్

భారత్ కేవలం మిడిల్‌ఈస్ట్‌పై మాత్రమే ఆధారపడకుండా తమ దిగుమతులకు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకుంటోంది. ప్రస్తుతం భారత్‌ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 43 శాతం చేరింది. రాయితీలు తగ్గినా, సరఫరా నిరంతరాయంగా అందించేలా భారత్‌ రష్యన్‌ ట్యాంకర్ల వైపు చూస్తోంది. ఖతార్ నుంచి వచ్చే గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా, అమెరికా, నార్వే, కెనడా లాంటి దేశాలతో చర్చలు జరుపుతోంది. 

Also Read: కోల్‌కతాలో సీఈసీకి నిరసన సెగ.. నల్లజెండాలతో గోబ్యాక్ నినాదాలు

భారత్ దగ్గర ప్రస్తుతం 50 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. దేశంలో 423.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 595.4 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ 41 దేశాల నుంచి చమురు సేకరిస్తూ అంతర్జాతీయ ఇంధన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వెళ్తోంది. ఈ  సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు