Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో నేటి నుంచి మహా మహాకుంభ్ 2025 ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్ నగరంలోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళా జరుగుతుంది. 30-45 రోజుల పాటు జరిగే ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి ప్రపంచనలుమూలల నుంచి లక్షల సంఖ్యల్లో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జాము నుంచే లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పురుషులు, మహిళలు, పెద్దలు, పిల్లలు, పెద్ద సంఖ్యలో సాధువులు సంగం వద్ద పవిత్ర కర్మలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. Also Read: Maha Kumbh 2025: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే! గత 48 గంటల్లో 85 లక్షల మంది గంగ స్నానం.. ఉదయం 7.30గంటల వరకే 35లక్షల మందికి పైగా భక్తులు, సాధువులు, పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ప్రయాగ్‌రాజ్ అధికారులు తెలిపారు. మొదటి రోజే దాదాపు కోటి మంది భక్తులు గంగాస్నానం చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాదు మహా కుంభ్ ప్రారంభానికి ముందే అంటే.. ఆదివారం రోజే సుమారు 50 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా గత 48 గంటల్లో 85 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కుంభమేళాలో పుష్కర స్నానం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా? రాజ స్నానాలు మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు ఉంటాయి. అందులో మూడు స్నానాలు చాలా ముఖ్యమైనవి. మొదటి రాజ స్నానం జనవరి 13న, రెండవ రాజ స్నానం జనవరి 14న మకర సంక్రాంతి రోజున, మూడవ రాజ స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున జరుగుతుంది. Also Read: Maha Kumbh 2025: మహాకుంభంలో రాజ స్నానం ప్రత్యేక తేదీలివే.. ఎందుకంత విశిష్టత?