Maha Kumbamela 2025: కుంభమేళా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, మతపరమైన ఉత్సవంగా పరిగణించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్ నగరంలోని గంగా, యమునా, పురాణ సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళా జరుగుతుంది. ఈ ఏడాది మహా కుంభమేళా జనవరి 13న యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమై ఫిబ్రవరి 25, 2025న ముగుస్తుంది. 30-45 రోజుల పాటు జరిగే కుంభమేళా హిందువులకు చాలా ప్రత్యేకమైనది. కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొందుతారని.. అన్ని ఆనందాలను అనుభవించిన తరువాత, అతను చివరకు మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.
Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది?
మహా కుంభమేళ 2025 ఆసక్తికరమైన గణాంకాలు
- IPL కంటే 10 రెట్లు ఆదాయం, పాకిస్థాన్ జనాభా కంటే రెండింతల జనం, 6 పార్లమెంట్లు నిర్మించగలిగేంత ఖర్చుతో కుంభమేళా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది.
- ప్రపంచంలోని మొత్తం జనాభాలో 5%కి సమానమైన ప్రజలు ఒకే చోటకి సమావేశమవుతున్న మహా ఉత్సవంగా కుంభమేళా ఉండబోతుంది. ఈ సారి 2025 కుంభమేళా కి 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
- మహాకుంభమేళకు హాజరయ్యే భక్తుల సంఖ్య పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా.. అదేవిధంగా అమెరికాలోని 33.5 కోట్ల, రష్యాలోని 14.4 కోట్ల జనాభా కంటే ఎక్కువ
- 2025 మహాకుంభంలో భక్తుల కోసం 1.5 లక్షల పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అంటే ప్రతి లక్ష మందికి భక్తులకు 2,666 టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
- అయితే 2019 కుంభమేళా సందర్భంగా బియ్యం వినియోగం.. స్వర్ణ దేవాలయంలో ఉపయోగించిన లంగర్ కంటే 110 రెట్లు ఎక్కువ. అలాగే పిండి వినియోగం 16 రెట్లు ఎక్కువ. ఈ సారి మరింత పెరిగే ఛాన్స్
- 2019 ప్రయాగ్రజ్ అర్ధ కుంబ్ లో 13,218 టన్నుల రేషన్ (54 వేల క్వింటాళ్లు రైస్, 78 వేల క్వింటాళ్లు పిండి) ఉపయోగించబడింది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్(భోజన పంపిణీ) సిఖ్ స్వర్ణ మందిరంలో ఉండే లంగర్ తో పోలిస్తే చాలా రేట్లు ఎక్కువ. అక్కడ ప్రతి రోజు 10 క్వింటాళ్లు రైస్, 100 క్వింటాళ్లు పిండి ఉపయోగిస్తారు.
Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆవేదన