Maha Kumbamela 2025: హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహా కుంభమేళ నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. ఈ మహా కుంభమేళాకు దేశనలుమూలల నుంచి 40 కోట్లకు పైగా జనాభా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్ లోని గంగా, యమునా, సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో పుష్కర స్నానం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి కలుగుతుందని.. విముక్తి పొందుతారని విశ్వాసం. అయితే కుంభమేళాలో పుష్కర స్నానానికి గల ప్రాముఖ్యత, మహా కుంభంలో మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
మహాకుంభమేళా ప్రత్యేకత
ఈ ఏడాది మహాకుంభమేళా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహాల శుభ స్థానం ఏర్పడనుంది. పూర్వం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేసిన సమయంలో ఇది ఏర్పడింది. అలాగే రేపు ఉదయం 7.15 గంటలకు రవియోగం ప్రారంభమై 10.38 గంటలకు ముగుస్తుంది. ఈ యోగంలో విష్ణువును పూజించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది.
కుంభమేళాలో స్నానం ప్రాముఖ్యత..
అయితే సముద్ర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు 12 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో కలశం నుంచి అమృత బిందువులు పడిన చోట కుంభమేళా నిర్వహిస్తారు. అందుకే ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ మహా కుంభ స్నానాన్ని రాజ స్నానం అంటారు.
రాజ స్నానానికి అనుకూలమైన సమయం
పౌర్ణమి సందర్భంగా రేపు మహాకుంభం మొదటి రాజ స్నానం జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, జనవరి 13న అంటే రేపు ఉదయం 5:03 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమై జనవరి 14న ముగుస్తుంది.
- రాజ స్నానం బ్రహ్మ ముహూర్తం జనవరి 13న - 05:27 AM నుంచి 06:21 AM వరకు
- ఉదయం, సాయంత్రం ముహూర్తం - ఉదయం 5.54 నుంచి 7.15 వరకు
- విజయ ముహూర్తం - మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 వరకు
- సంధ్యా సమయం - సాయంత్రం 5.42 నుంచి 6.09 వరకు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా