KTR: కమలా హారిస్‌ పై కేటీఆర్‌ ట్వీట్‌!

కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కొనియాడారు.ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.

author-image
By Bhavana
New Update
MLA KTR

KTR :

అగ్రరాజ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్‌‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ట్రంప్‌తో జరిగిన ఈ డిబేట్‌లో కమలా దూకుడు ప్రదర్శించారు. ట్రంప్‌ విధానాలను ఎండగట్టారు.ఈ చర్చలో ట్రంప్‌పై కమలా చేసిన ఎదురుదాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. 

కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అంటూ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది.. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది.కాగా, నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమాక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ప్రచారంలో అదరగొడుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి పోటీని ఇస్తున్న సంగతి తెలిసిందే.

Also Read :  ఉధృత గోదావరి.. 50 అడుగులు దాటి నిలకడగా వరద!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు