American female journalist : ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్టు కిడ్నాప్‌..కలకలం రేపుతున్న వీడియో

ఇరాక్‌, అమెరికాకు మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాక్‌లో ఒక మహిళా జర్నలిస్ట్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. అమెరికాకు(US) చెందిన మహిళా ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (5)

Kidnapping of American female journalist in Iraq

American female journalist  : ఇరాక్‌, అమెరికాకు మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాక్‌లో ఒక మహిళా జర్నలిస్ట్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. అమెరికాకు(US) చెందిన మహిళా ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది. ఆమెను కిడ్నాప్‌ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొంతమంది దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్‌గా మారింది. బాగ్దాద్‌లోని ఓ హోటల్‌ బయట ఉన్న కిటెల్సన్‌ను అపహరించినట్లు తెలుస్తోందని ఇరాక్‌ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. కిడ్నాపైన జర్నలిస్ట్‌ షెల్లీ కిటెల్సన్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, జర్నలిస్ట్‌ కిడ్నాప్‌ వ్యవహారానికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అతడికి ఇరాన్‌తో(Iran) సన్నిహితంగా ఉండే కతైబ్‌ హెజ్‌బొల్లా మిలిషియా బృందాలతో సంబంధం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ కిడ్నాప్‌ను ధ్రువీకరిస్తూ ఖతర్‌ మీడియా సంస్థ అల్‌జజీరా వీడియో విడుదల చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా మహిళా జర్నలిస్ట్‌ కిడ్నాప్‌ ఘటనను  అంతర్జాతీయ మహిళా మీడియా ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌(IWMF) ఎలీసా లీస్‌ మునోజ్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘షెల్లీ కిటెల్సన్‌ అత్యంత ధైర్యవంతురాలైన జర్నలిస్ట్‌. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతం నుంచి ఆమె న్యూస్‌ కవర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను బాగ్దాద్‌ వీధుల్లో దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లడం అత్యంత విచారకరం. ఆమె ఆచూకీ ఆందోళనగా ఉంది’’ అని ఎలీసా సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తంచేశారు.

Advertisment
తాజా కథనాలు