/rtv/media/media_files/2026/03/11/ali-khamenei-will-rejected-son-mojtaba-2026-03-11-11-55-06.jpg)
Ali Khamenei's will rejected son Mojtaba
Khamenei Opposed Son Mojtaba : ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆయన స్థానంలో కుమారుడు అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ ఎంపికయ్యాడు. ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖమేనీ హత్య తర్వాత ఆయన స్థానంలో మొజ్తాబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఆయన ఎన్నికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు వ్యతిరేకిస్తున్నారు. కేవలం ట్రంపు మాత్రమే కాదని ఆయన తండ్రికే ఇష్టం లేదంటూ కొన్ని ఆధారాలు వెలుగు చూడటం సంచలనంగా మారింది.
తన తర్వాత వారసుడిగా కుమారుడు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టడానికి అతనికి తగిన అర్హతలు లేవని ఆయతుల్లా గతంలో పలు మార్లు చెప్పాడు. ఇపుడు అవే వ్యాఖ్యల్ని ఆసరగా చేసుకుని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఒత్తిడి మేరకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు కథనం తేల్చి చెప్పింది.
దాంతోపాటు ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడుతున్న నేషనల్ యూనియల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (ఎన్‌యూడీఐ) రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో స్పందించారు.. మొజ్తాబాకు ఇరాన్‌ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవు అని ఈ సందర్భంగా పేర్కొరన్నాడు.
ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని కొనసాగించడానికి సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్)కి మాత్రమే ఉంది. అంతేకాదు, మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదన్నది పలువురి వాదన. దీంతో, గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్‌జీసీ తరుఫు ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదని. అతనిపై చాలా వ్యతిరేకత ఉందని. కానీ ఐఆర్‌జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్‌జీసీ చూస్తోందని. అందుకే మొజ్తాబాను ఎంచుకుందని. ఐఆర్‌జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్‌జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ పలువుర ఆరోపిస్తున్నారు.
Follow Us