/rtv/media/media_files/2025/01/17/iCzYXFs8prNPxbrlw4KP.jpg)
israel
Israel:కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం. మరణించిన వారిలో చాలా మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ప్రకటించారు.
Also Read: Breaking: చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!
15 నెలలుగా కొనసాగుతున్న విధ్వంసక యుద్ధాన్ని ముగించి, అనేక మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి ఈ కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ మరుసటి రోజే ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 ఆదివారం నుండి అమల్లోకి వస్తుందని అల్ సాని ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్ దీనికి ముందే దానిని క్రాస్ చేసింది.
15 నెలలుగా యుద్ధం..
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 15 నెలలుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ముగుస్తుందని అనిపించింది కానీ అది జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇద్దరూ అంగీకరించారు. నవంబర్ 2023లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజుల పాటు కాల్పుల విరమణ జరిగింది. ఈ కాలంలో గాజా నుండి 100 మందికి పైగా బందీలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!
కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ తన కొత్త డిమాండ్లను వదులుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కాల్పుల విరమణ పై సమావేశం ఉండదు. దీనిపై యుద్ధ మంత్రివర్గం ఇప్పుడు నిర్ణయం తీసుకోదు. గాజాలో హమాస్ వెనక్కి తగ్గాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హమాస్ తన వాగ్దానాలను ఉల్లంఘిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని ఈ ప్రకటన తర్వాత హమాస్ కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.
హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇందులో సుమారు 1200 మంది మరణించారు. 250 మంది బందీలుగా ఉన్నారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్‌పై భారీగా బాంబు దాడులు నిర్వహించింది. గాజాలో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించింది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 46 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. అక్కడి జనాభాలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మానవతా సంక్షోభం తీవ్రంగా తలెత్తింది.
Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి..!
Also Read: Ap Liquor: ఓరి మీ దుంపలు తెగ..అన్ని కోట్లు ఎలా తాగేశార్రా బాబు!